IPl 2026: బంగ్లాదేశ్ యూటర్న్-ప్రభుత్వం కీలక నిర్ణయం..!

బంగ్లాదేశ్ లో గతంలో హిందువుల హత్యలకు నిరసనగా ఆ దేశ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఐపీఎల్ 2026 (IPL 2026)నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో బంగ్లాదేశ్ ఈ టోర్నీని తమ దేశంలో ప్రత్యక్ష ప్రసారం చేయరాదని బంగ్లాదేశ్ నిర్ణయించింది. దీంతో పాటు భారత్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను సైతం బహిష్కరించింది. కానీ ఇప్పుడు పరిస్ధితుల్లో మార్పు వచ్చింది. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.

ఈ ఏడాది ఆరంభంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాలను నిషేధించిన బంగ్లాదేశ్.. ఈ సీజన్‌లో లీగ్‌పై విధించిన పూర్తిస్థాయి నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ విషయాన్ని ఆ దేశ సమాచార, ప్రసార శాఖ మంత్రి జహీర్ ఉద్దీన్ స్వపన్ ఇవాళ మీడియాకు వెల్లడించారు. దీంతో బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారాలకు మార్గం సుగమం అయింది. ఇవాళ్టి నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బంగ్లా ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Bangladesh Ends IPL 2026 Blackout Minister Confirms Broadcast U-Turn

గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసిన తమ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ పై బీసీసీఐ ఆదేశాల మేరకు లీగ్ నుంచి తప్పించింది. అయితే దీనిపై ముస్తాఫిజుర్ నేరుగా స్పందించలేదు. అయితే అప్పటి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మాత్రం ఐపీఎల్ ప్రసారాల నిషేధం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. దీంతో బంగ్లాదేశ్ లో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ టోర్నీ మ్యాచ్ లను లైవ్ లో చూసేందుకు వీలు కలగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+