IPL 2026: మంగళగిరిలో ఐపీఎల్ సందడి-రేపు, ఎల్లుండి ఫ్రీ పాస్ తో..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL 2026) జోరుగా సాగుతోంది. క్రికెట్ అభిమానులు స్టేడియాల్లో నేరుగా మ్యాచ్ లు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా వీలు కాని వారు టీవీల్లో, ఫోన్లలో మ్యాచ్ లు చూసుకుంటున్నారు. ఈ రెండింటికీ మధ్యలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ లు కూడా అభిమానుల్ని అలరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ పెంచేందుకు బీసీసీఐ పలు చోట్ల ఫ్యాన్ పార్క్ లు ఏర్పాటు చేస్తోంది. ఇదే క్రమంలో ఏపీలోని మంగళగిరిలోనూ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు.

మంగళగిరిలో రెండు రోజుల ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ (IPL Fan Park) ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు ప్రకటింంచారు. బీసీసీఐ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఐఐసీ భవనం దగ్గర్లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఫ్యాన్ పార్క్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌లను అభిమానులు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. రేపు దిల్లీ - పంజాబ్, రాజస్థాన్ - హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్‌లు ఇక్కడ ప్రదర్శిస్తారు. ఎల్లుండి గుజరాత్ - చెన్నై, లక్నో- కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్‌లు ప్రసారం చేస్తారు.

BCCI Brings IPL 2026 Fan Park to Mangalagiri This Weekend Live Matches Music and More

స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా ఈ ఫ్యాన్ పార్క్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యాన్ పార్క్ లో భారీ స్క్రీన్స్ పై మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారంతో పాటు అక్కడ జరిగే కార్యక్రమాల్ని సైతం స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ కార్యక్రమం నిర్వహణ సాధ్యమైందని ఎంపీ సానా సతీష్ తెలిపారు. ఈ ఫ్యాన్ పార్క్ లు అభిమానుల్ని ఉచితంగానే అనుమతించనున్నారు. ఫ్యాన్ పార్క్ లో మ్యాచ్ లతో పాటు అభిమానుల కోసం పలు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+