ఎంపీతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న క్రికెటర్ రింకూ సింగ్ !
భారత క్రికెట్ జట్టు ఆటగాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) స్టార్ ప్లేయర్ రింకూ సింగ్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి అడుగుపెట్టాడు. ఆయన సమాజ్‌వాదీ పార్టీ యువ ఎంపీ ప్రియా సరోజ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుక నేడు ( జూన్ 8న ) లక్నోలో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు.
ఈ నిశ్చితార్థానికి ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్, ప్రముఖ నటి-ఎంపీ జయా బచ్చన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. రింకూ, ప్రియాల నిశ్చితార్థానికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ జంట నవంబర్ 18న వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. అభిమానులు సైతం వీరికి విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

ఇక 27 ఏళ్ల రింకూ సింగ్ ఇప్పటి వరకు 2 వన్డేలు, 33 టీ20 మ్యాచ్‌లు భారత జట్టు తరఫున ఆడాడు. ఐపీఎల్‌లో కేకేఆర్‌కు కీలక ఆటగాడిగా నిలుస్తున్నారు. అలానే 26 ఏళ్ల ప్రియా సరోజ్ వారణాసి జిల్లా కర్ఖియాన్ గ్రామానికి చెందినవారు. తండ్రి తూఫానీ సరోజ్ మూడుసార్లు ఎంపీగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
ప్రియా తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. మచిలీషహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీగా గెలిచారు. బీజేపీ సీనియర్ నేత బీపీ సరోజ్‌పై 35,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి.. దేశంలోని అతి పిన్న వయస్కుల ఎంపీలలో ఒకరిగా నిలిచారు.












Click it and Unblock the Notifications