టీమిండియా దండయాత్ర: మొదటిసారి వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తోన్న స్టేడియంలో..!!
న్యూఢిల్లీ: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచారు బ్లాక్ క్యాప్స్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. న్యూజిలాండ్ తరువాత భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. మూడు విజయాలు- ఆరు పాయింట్లు టీమిండియా ఖాతాలో ఉన్నాయి.
టీమిండియా ప్రదర్శిస్తోన్న ఈ దూకుడు చూస్తోంటే- నాలుగో విజయం సునాయాసమే అవుతుంది. తన తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఎదుర్కొనబోతోంది రోహిత్ సేన. నేడు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ స్టేడియంలో జరగబోయే మొట్టమొదటి వరల్డ్ కప్ మ్యాచ్ ఇదే.

ఈ నెల 8వ తేదీన చెన్నై చెపాక్ స్టేడియంలో మొదలైంది టీమిండియా జైత్రయాత్ర. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. లో- స్కోర్ మ్యాచ్ ఇది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 199 పరుగులకే చాప చుట్టేయగా.. ఈ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది భారత్. ఓపెనర్లు విఫలమైనప్పటికీ- విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ జట్టుకు ఘన విజయాన్ని అందించారు.
మలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసింది ఆఫ్ఘన్. ఆ జట్టు నిర్దేశించిన 272 పరుగులను భారత్ అలవోకగా అందుకుంది. ఈ క్రమంలో రెండు వికెట్లనే కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు కేప్టెన్ ప్లస్ ఓపెనర్ రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 191 పరుగులకే చతికిలపడింది. ఇక్కడా ఛేజింగే. ఈ స్వల్ప లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి కొట్టేసింది. ఏడు వికెట్లతో విజయదుందుభి మోగించింది. ఈ మూడింట్లోనూ టీమిండియా రెండోసారి బ్యాటింగ్ చేసింది. ఛేజింగ్ కింగ్ అనిపించుకుంది.
ఇక బంగ్లాదేశ్‌పై అదే జోరును కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న ఆసియా కప్ 2023లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది భారత్. వరల్డ్ కప్ టోర్నమెంట్లల్లో భారత్‌పై బంగ్లాదేశ్‌కు చెప్పుకోదగ్గ రికార్డులేమీ లేవు. వరల్డ్ కప్‌లో భారత్‌ను ఒక్కసారి మాత్రమే ఓడించింది బంగ్లా. 2007లో వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకోవడానికే మొగ్గు చూపొచ్చు కేప్టన్ రోహిత్ శర్మ. ఇప్పటివరకు సాధించిన మూడు విజయాలు కూడా సెకెండ్ ఇన్నింగ్‌లో నమోదైనవే. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ సంచలన విజయాలు సాధించాయి. ఆఫ్ఘన్.. ఇంగ్లాండ్‌ను, నెదర్లాండ్స్.. దక్షిణాఫ్రికాను ఓడించాయి. అదే తరహాలో బంగ్లాదేశ్ సంచలనం సృష్టిస్తుందనే అంచనాలు లేకపోలేదు.
తుదిజట్టులో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ ఆడొచ్చు.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications