చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది

ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకు బోణీ కొట్టని జట్లు అంటూ ఏవైనా ఉన్నాయంటే అవి చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్. ఈ రెండు జట్లు కూడా ఆడిన మ్యాచ్ లన్నీ ఓడిపోయాయి. చెన్నై మూడు, గుజరాత్ రెండింట్లో పరాజయం పాలయ్యాయి. తమ ప్రత్యర్థులకు రెండేసి చొప్పున పాయింట్లను ధారదాత్తం చేశాయి. గుజరాత్ టైటాన్స్ పరిస్థితి అటుంచితే ఈ వరుస ఓటములు చెన్నై సూపర్ కింగ్స్ ను మాత్రం తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. హేటర్స్ కు ట్రోలింగ్ స్టఫ్ ను అందించాయి.

ఇప్పుడీ పరిస్థితికి బ్రేక్ పడే అవకాశాలు లేకపోలేదు. దీనికి కారణం- ఈ సీజన్ లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని డెవాల్డ్ బ్రేవిస్ జట్టుకు అందుబాటులోకి రానున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆడే తదుపరి మ్యాచ్ నాటికి ఫిట్ నెస్ సాధించడం లాంఛనమే కానుంది. ఈ నెల 11వ తేదీన ఢిల్లీ కేపిటల్స్ తో మ్యాచ్ ఆడనుందీ జట్టు. ఢిల్లీ కేపిటల్స్ సెకెండ్ హోమ్ గ్రౌండ్ లక్నో స్టేడియం దీనికి వేదిక. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

Dewald Brevis Chennai Super Kings Player Seals Comeback to Take the Field on April 11 vs DC

ఈ మ్యాచ్ నాటికి తాను జట్టుకు అందుబాటులో ఉండబోతోన్నానని డెవాల్డ్ బ్రేవిస్ వెల్లడించాడు. ఆ మ్యాచ్ ఆడబోయే తుదిజట్టులోకి తన పేరును పరిశీలనలోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ కు విజ్ఞప్తి చేశాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న సీఎస్కేకు ఇది భారీ ఊరటనిస్తోంది. పక్కటెముకల్లో గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్‌లకు దూరం అయ్యాడీ సౌతాఫ్రికన్ బ్యాటర్. ఇప్పుడు పునరాగమనం చేయనున్నాడు.

అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్కే.. ప్రస్తుత సీజన్‌లో తొలి మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. ధోని, బ్రెవిస్ లేకపోవడంతో టీమ్‌ బ్యాటింగ్ ఆర్డర్ బలహీనపడింది. అనుభవజ్ఞుడైన ధోనీ జట్టులో లేకపోవడం కొంత ప్రతికూలంగా పరిణమించింది. కేప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ విఫలమౌతున్నాడు. ఒత్తిడిని ఎదుర్కొంటోన్నాడు. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. 44 ఏళ్ల ధోని కండరాల గాయం నుండి పూర్తిగా కోలుకుంటున్నాడని ఎక్స్‌ప్రెస్ స్పోర్ట్స్ తెలిపింది.

ఈ గాయం కారణంగా అతను టోర్నమెంట్‌లోని మొదటి రెండు వారాలకు దూరమయ్యాడు. త్వరలోనే ధోని కీలక ఫిట్‌నెస్ టెస్ట్‌కు హాజరు కానున్నాడు. ఈ క్రమంలో ధోనీ ఇప్పటికే నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ సైతం ప్రారంభించాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా కొనసాగినా, ధోని మైదానంలో ఉండటం వల్ల జట్టుకు వ్యూహాత్మక మార్గదర్శకత్వం, కీలక పరిస్థితుల్లో మ్యాచ్‌లను ముగించే శక్తి లభిస్తుందని సీఎస్కే ఆశిస్తోంది. ఇది జట్టుకు అత్యవసరం కూడా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+