వర్షం పడితే ఫైనల్ కు వెళ్లేదెవరు- స్పిన్నర్లపై కొత్త ఫార్ములా..!!

Ind Vs Aus Semi Final Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా నిరీక్షిస్తున్న మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇండియా - ఆసీస్ మధ్య దుబాయ్ వేదికగా జరిగే సెమీ ఫైనల్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. దుబాయ్ వాతావరణం తో పాటుగా పిచ్ కండీషన్ పైన ఆసక్తి పెరుగుతోంది. న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత్..ఆసీస్ తో ఎలాంటి ప్రయోగం చేస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ పెంచుతున్న అంశం. ఇక, ఈ మ్యాచ్ కు సంబంధించి ఆసక్తి కర అంశాలు వెలుగు లోకి వస్తున్నాయి.

తుది జట్టులో ఉండేదెవరు
భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరుతుందా. ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఆసీస్ పైన విజయం సాధించి ప్రపంచ కప్ ఫైనల్ ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది క్రికెట్ ఫ్యాన్స్ వేచి చూస్తున్న విషయం. ఇప్పటికే దుబాయ్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో ఉన్న టీమిండియాను ఫేవరెట్‌గా భావిస్ తున్నా.. ఆసీస్ తో తల పడటం సులువైనది కాదు. ఆసీస్ కీలక ఆటగాళ్లు లేకపోయినా సెమీస్ దశ కు చేరుకుంది. ఇక, భారత్ నుంచి స్పిన్నర్ల పైనే భారీ అంచనాలు ఉన్నాయి. న్యూజీలాండ్ పైన విజయం అందించిన నలుగురు స్పిన్నర్లనే ఇక్కడా ప్రయోగిస్తారని భావిస్తున్నారు. సెమీ ఫైనల్ లో ఇప్పుడు అందరి చూపు వరుణ్ చక్రవర్తి పైనే ఉంది. షమీకు తోడుగా మరో సీమర్ గా ప్రస్తుతం హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తున్నారు.

Forecast predicting a sunny and clear day in Dubai for the IND vs AUS Semi final

ముగ్గురే స్పిన్నర్లు
అయితే.. సెమీ ఫైనల్ కావటంతో షమీతో పాటుగా మరో పేస్ బౌలర్ అవసరమనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో, షమికి తోడు మరో స్పెషలిస్ట్‌ పేసర్‌గా హర్షిత్‌ లేదా హర్షదీప్ లో ఒకరికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో, నలుగురు స్పిన్నర్లలో ఒకరిని డ్రాప్ చేయాల్సి వస్తే ఎవరిని పక్కన పెడతారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ మాత్రం ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఆసీస్ బ్యాటర్ హెడ్‌ నుంచి భారత్ కు ఎప్పుడూ ప్రమాదమే. దీంతో, హెడ్ ను కంట్రోల్ చేసేందుకు కొత్త ప్లాన్ అవసరం. హెడ్ క్రీజులో నిలదొక్కుకుంటే నిలువరించే అవకాశాలు తక్కవే. ఇక.. స్మిత్, క్యారీ, మ్యాక్స్ వెల్ సైతం ఎలాంటి పరిస్థితుల్లో అయినా తమ టీం ను విజయం వైపు తీసుకెళ్లే సామర్ధ్యం కలిగిన బ్యాటర్లు.

వర్షం లేనట్లే
ఇక, మంగళవారం దుబాయ్‌లో వాతావరణం గురించి అందోళన నెలకొంది. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం లేదని వాతావరణ శాఖ తేల్చి చెప్పింది. మ్యాచ్ మొదటి అర్ధభాగంలో ఉష్ణో గ్రత 30 డిగ్రీల సెల్సియస్ చుట్టూ ఉండవచ్చు. సాయంత్రం తర్వాత 25 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చు. దుబాయ్‌లో వర్ష సూచన లేక పోవటం క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ గా మారింది. ఇక, టాస్ కీలకంగా మారుతోంది. దుబాయ్ లోని మూడు పిచ్ లు భిన్న స్వభావం కలిగి ఉన్నాయి. మ్యాచ్ జరిగే పిచ్ ఆధారంగా తుది జట్టు ఎంపిక ఉంటుందని రోహిత్ వెల్లడించారు. దీంతో, ఈ హోరా హోరీ మ్యాచ్ లో రోహిత్ సేన విజయం సాధించి ఫైనల్ కు వెళ్లటం ఖాయమనే ఫ్యాన్స్ అంచనాలు ఏ మేర నిజమవుతాయో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+