ఎన్నికల బరిలోకి యువరాజ్ - పార్టీ, నియోజకవర్గం ఫిక్స్..!!
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే తాను చేరే పార్టీలో గ్రౌండ్ సిద్దం చేసుకున్నారు. పోటీ చేసే నియోజకవర్గం పైన హామీ తీసుకున్నారు. గౌతం గంభీర్, సచిన్ టెండూల్కర్‌లు ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు యువరాజ్ వీరి లిస్టులో చేరే ప్రయత్నం చేస్తున్నారు. యువరాజ్ రాజకీయ ఎంట్రీ ఆసక్తి కరంగా మారుతోంది.
ధనాధన్ ఇన్నింగ్స్‌లతో భారత జట్టు గొప్ప విజయాలు అందించిన యూవీ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. కేన్సర్ ను సైతం జయించి తిరిగి మైదానంలోకి అడుగుపెట్టి యువరాజ్ సింగ్ సత్తా చాటాడు. తల్లి షబ్నమ్ సింగ్‌తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసారు. దాంతో, అతడు రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నాడనే వార్తలు వైరల్ అయ్యాయి.

యువరాజ్ సింగ్ గురుదాస్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సన్నీ డియోల్ గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో డియోల్ స్థానంలో యువరాజ్ సింగ్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
గురుదాస్‌పూర నుంచి ఇప్పటికే బాలీవుడ్ నటులు సన్నీ డియోల్, వినోద్ ఖన్నాలు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్స్‌లో ఆడుతున్న యూవీ న్యూయార్క్ సూపర్ స్టార్ స్ట్రైకర్స్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీమిండియా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించాడు.
దక్షిణాఫ్రికా గడ్డపై 2007లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఇంగ్లండ్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపి చరిత్ర సృష్టించాడు. మెడియస్టినల్ సెమినోమాఅనే అరుదైన క్యాన్సర్ బారిన పడిన యూవీ.. అమెరికాలోని బోస్టన్‌లో కీమోథెరపీ చికిత్స తీసుకున్నాడు. ఆ మహమ్మారి నుంచి 2012లో యువరాజ్ క్యాన్సర్ నుంచి కోలుకున్నాడు. అయితే, ఇప్పుడు పొలిటికల్ ఇన్నింగ్స్ గురించి యూవీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications