IPL 2025 Winner: ఐపీఎల్ గెలిచేది ఆ జట్టే-తేల్చేసిన డేవిడ్ వార్నర్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) తుది అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే తొలి క్వాలిఫయర్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రాయల్ గా ఫైనల్లో అడుగుపెట్టేసింది. ఆ తర్వాత జరిగిన ఎలిమినేటర్ లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించిన ముంబై ఇండియన్స్.. ఇవాళ జరిగే రెండో క్వాలిఫయర్ లో పంజాబ్ కింగ్స్ తో తలపడేందుకు సిద్దమవుతోంది. ఇవాళ మ్యాచ్ లో విన్నర్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడటం ఖాయం.
ఈ నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ టైటిల్ ఎవరు గెలవబోతున్నారనే దానిపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఎవరికి వారు జోస్యాలు చెబుతున్నారు. ఇప్పటికే ఆర్సీబీ మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్.. ఈసారి టైటిల్ తమదేనని జోస్యం చెప్పేసాడు. మరికొందరు క్రికెట్ గ్రేట్స్ ముంబై ఇండియన్స్ ను ఫైనల్ విజేతగా ఊహిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ కు సైతం ఫైనల్ నెగ్గే సత్తా ఉందన్న చర్చ క్రికెట్ వర్గాల్లో సాగుతోంది.

ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఆర్సీబీని ఓడించి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన జోస్యం కూడా చెప్పాడు. ఇందులో వార్నర్ టైటిల్ గెలిచే జట్టుతో పాటు ఆ విజయంలో కీలక పాత్ర పోషించబోతున్న ఆటగాడిని సైతం అంచనా వేశాడు. దీంతో వార్నర్ అంచనాలు చర్చనీయాంశమవుతున్నాయి.

ఈసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గే సత్తా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తేల్చిచెప్పేశాడు. ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ కచ్చితంగా గెలువబోతోందని, అలాగే ఈ విజయంలో తన ఆసీస్ సహచరుడు జోష్ హేజిల్ వుడ్ కీలక పాత్ర పోషించబోతున్నాడని వార్నర్ అంచనా వేస్తున్నాడు. ఇప్పటికే జట్టులో కొహ్లీ వంటి మ్యాచ్ విన్నర్లను ఉంచుకుని హేజిల్ వుడ్ ఆర్సీబీ టైటిల్ విజయంలో కీలకంగా మారబోతున్నట్లు వార్నర్ అంచనా వేయడం విశేషం. ఎక్స్ లో తన ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా డేవిడ్ వార్నగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.












Click it and Unblock the Notifications