Gautam Gambhir: ఈ ప్లాన్ వాళ్లదే..! అసలు విషయం చెప్పిన గంభీర్ ..!
టీ20 వరల్డ్ కప్ ( T20 world cup 2026)లో భారత్ చరిత్ర సృష్టించింది. అదే సమయంలో చరిత్రను తిరగరాసింది. స్వదేశంలో తొలిసారి టీ20 వరల్డ్ కప్ గెల్చుకోవడంతో చరిత్ర సృష్టించిన టీమిండియా.. మూడోసారి ఈ ఘనత సాధించి చరిత్రను తిరగరాసింది. దీంతో ఈ వరల్డ్ కప్ క్రెడిట్ పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ విషయంలో టీమిండియా క్రికెటర్లతో పాటు కోచ్ లు కూడా రకరకాల విశ్లేషణలు, వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇదే క్రమంలో హెడ్ కోచ్ గౌతం గంభీర్ (gautam gambhir) కూడా తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజీలాండ్ పై సాధించిన విజయం దేవుడి ప్లాన్ అంటూ పలువురు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందింంచిన టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ .. ఇది కేవలం దేవుడి ప్లాన్ మాత్రమే కాదని, 1.4 కోట్ల మంది భారతీయుల ప్లాన్ కూడా అని వెల్లడించాడు. అంతే కాదు జట్టులో ఇప్పుడు ప్రతీ ఒక్కరూ ఛాంపియన్ అని కూడా గంభీర్ స్పష్టం చేశాడు.

This wasn’t just God’s plan, it was the plan of 1.4 Billion Indians! Each player a WORLD CHAMPION! 🇮🇳 🏆 🏆🏆 pic.twitter.com/5bM6wcMtAm
— Gautam Gambhir (@GautamGambhir) March 9, 2026
ఈసారి వరల్డ్ కప్ లో టీమిండియా మ్యాచ్ గెలిచినప్పుడల్లా ఇది ఆ బౌలర్ వల్లే, ఈ బ్యాట్స్ మెన్ వల్లే అనే వ్యాఖ్యలు,విశ్లేషణలు వినిపించాయి. దీనిపై ఇప్పటికే పలుమార్లు ప్రెస్ మీట్లలో క్లారిటీ ఇచ్చిన గంభీర్.. ఇప్పుడు మరోసారి అందరి సమష్టి కృషి వల్ల భారత్ ఈ ఘనత సాధించగలిగిందని స్పష్టం చేశాడు. అందుకే జట్టులో ప్రతీ ఒక్కరూ ఛాంపియనే అనే వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వరల్డ్ కప్ ట్రోఫీని ఇద్దరికి అంకితం చేస్తున్నట్లు మ్యాచ్ గెలిచాక గంభీర్ వ్యాఖ్యానించాడు. ఇందులో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తో పాటు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఛీఫ్ గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ కూ అని వెల్లడించాడు.












Click it and Unblock the Notifications