పాకిస్తాన్ క్రికెట్ తో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ.. !!
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ లో వరుస అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. మొన్నటికి మొన్న జట్టు టెస్ట్ ఫార్మట్ హెడ్ కోచ్ గా వ్యవహరిస్తోన్న మాజీ ఆల్ రౌండర్ అజర్ మహమూద్ పై వేటు పడింది. కాంట్రాక్ట్ గడువు ముగియక ముందే అతనికి ఉద్వాసన పలికింది బోర్డ్ మేనేజ్మెంట్. మూడు నెలలు ముందుగానే తప్పించింది. 2026 మార్చి వరకు టెస్ట్ మ్యాచ్ లు లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ మీడియా చెబుతున్నప్పటికీ- ఛైర్మన్ నక్వీతో భేదాభిప్రాయాలే దీనికి కారణమని తేలింది.
అంతకుముందు పాకిస్తాన్ టెస్ట్ ఫార్మట్ హెడ్ కోచ్ గా ఆస్ట్రేలియా మాజీ పేసర్ జేసన్ గిలెస్పీ వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆకస్మికంగా హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన చేయడానికి గల కారణాలను తాజాగా వెల్లడించారు. తాను అర్ధాంతరంగా వైదొలగడానికి జట్టు పేలవమైన ప్రదర్శన ఎంత మాత్రం కాదని వివరణ ఇచ్చాడు. పీసీబీ వైఖరి, దాని అంతర్గత వ్యవహారాలే తన రాజీనామాకు దారితీశాయని గిలెస్పీ స్పష్టం చేశాడు.

తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశాడు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చాడు. పీసీబీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అవమానకరమని పేర్కొన్నాడు గిలెస్పీ. సీనియర్ అసిస్టెంట్ కోచ్ టిమ్ నీల్సన్‌ను ముందస్తు సమాచారం లేకుండా పీసీబీ తొలగించిందని, దీంతో పరిస్థితులు అదుపుతప్పాయని వ్యాఖ్యానించాడు. తాను హెడ్ కోచ్‌గా ఉండగా సీనియర్ అసిస్టెంట్ కోచ్‌ను తనకు చెప్పకుండానే తొలగించిందని పేర్కొన్నాడు.
ఇది హెడ్ కోచ్‌గా తనకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదుని చెప్పాడు. దీంతో పాటు తాను అవమానంగా భావించిన అనేక ఇతర సమస్యలు కూడా ఉన్నాయి" అని బదులిచ్చాడు. నీల్సన్ విషయంలో పీసీబీ తీసుకున్న నిర్ణయం తనను పూర్తిగా అంధకారంలో పడేసిందని అన్నాడు. కేప్టెన్ షాన్ మసూద్‌తో సత్సంబంధాలు ఉన్నప్పటికీ.. దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని గిలెస్పీ అన్నాడు.
ఇలాంటి నిర్ణయాల నేపథ్యంలో పాకిస్తాన్ బోర్డుతో గానీ, జట్టుతో గానీ కలిసి పనిచేయడం అసాధ్యమని గిలెస్పీ స్పష్టం చేశాడు. రాజీనామా తర్వాత పీసీబీ తనకు కాంట్రాక్ట్ పూర్తి చెల్లింపులు చేయలేదని ఆరోపించాడు. గౌతమ్ గంభీర్ స్థానంలో టీమిండియా టెస్ట్ ఫార్మట్ హెడ్ కోచ్ గా అపాయింట్ అవుతారా? అని అడిగిన ప్రశ్నకు నో థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చాడు గిలెస్పీ. అటువంటి ఆలోచన కూడా తనకు లేదని పేర్కొన్నాడు.
-
రూ.48కే హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్.. -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications