భారత్ కు ఐసీసీ షాక్..! ఆసియాకప్ ట్రోఫీపై జైషా హ్యాండ్సప్..!

ఈ ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్ పై ఘన విజయంతో టైటిల్ విజేతగా నిలిచిన భారత్ కు ఇప్పటికీ ఆ ట్రోఫీ అందలేదు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య పెరిగిన గ్యాప్ ప్రభావంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ గా ఉన్న మొహసిన్ నక్వీ నుంచి ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. దీంతో ఆయన ట్రోఫీని తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ అది ఆయన వద్దే ఉంది.

అయితే తాజాగా ఐసీసీ సమావేశంలో ఈ ట్రోఫీ వ్యవహారం తేలుస్తామంటూ ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇందులో విఫలమయ్యారు. స్వయంగా ఐసీసీ ఛైర్మన్ గా అమిత్ షా కుమారుడు జై షా ఉన్నా భారత్ కు ఈ ట్రోఫీ ఇచ్చి తీరాల్సిందేనని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛీఫ్ నక్వీకి చెప్పలేకపోయారు. దీంతో భారత్ కు ఈ ట్రోఫీ అప్పగించే విషయంలో నిబంధనల సాకు చూపి నక్వీ నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఐసీసీ చేతులెత్తేసింది.

దీంతో ఆసియా కప్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన వివాదాల పరిష్కారానికి ఐసీసీ బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. బీసీసీఐ తాజాగా జరిగిన ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తిన తర్వాత రెండు దేశాల మధ్య వివాదంలో జోక్యం చేసుకోవడానికి ఐసీసీ అంగీకరించినట్లు ప్రకటన వెలువడింది. ఆసియా కప్‌పై భారత్, పాకిస్తాన్ రెండూ తమ తమ వైఖరికి కట్టుబడి ఉండటంతో .. ఐసీసీ బోర్డు భేటీలో ఒమన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పంకజ్ ఖిమ్జీ నేతృత్వంలో మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేయక తప్పలేదు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని, భారత్, పాక్ క్రికెట్ ప్రపంచంలో ముఖ్యమైన సభ్యులని, కాబట్టి వారి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఐసీసీ కోరింది.

ఐసీసీ సమావేశం సందర్భంగా జరిగిన చర్చల సమయంలో ఎటువంటి వివాదాలు తలెత్తలేదని, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ,, దక్షిణాఫ్రికా వంటి బోర్డులు .. భారత్, పాక్ బోర్డుల్ని శాంతింపజేయడానికి ప్రయత్నించాయని ఐసీసీ వర్గాలు తెలిపాయి. ట్రోఫీ సమస్యలను పరిష్కరించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడానికి కూడా వారు అంగీకరించారని పేర్కొన్నాయి. దీంతో ఇప్పుడు ఈ మధ్యవర్తిత్వ కమిటీ భారత్-పాక్ బోర్డులతో చర్చించి సామరస్యంగా ఈ వివాదానికి ముగింపు పలకాల్సి ఉంది. ఏదేమైనా ఐసీసీ ఛైర్మన్ గా జైషా ఉన్నా.. భారత్ కు హక్కుగా రావాల్సిన ట్రోఫీ ఇప్పించడంలో విఫలం కావడం విమర్శలకు తావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+