వచ్చాడు, అవుట్ అయ్యాడు, వెళ్లాడు- రిపీట్: కోహ్లీ కథ కంచికే..!!
IND vs AUS: బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న అయిదో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ కుప్పకూలుతోంది. రెండో ఇన్నింగ్‌లో 124 పరుగులకే అయిదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ అవుట్ అయ్యారు. పెవిలయన్ చేరారు. ఆస్ట్రేలియాపై స్వల్పంగా ఆధిక్యతను సాధించింది.
రెండో రోజు టీ విరామ సమయానికి ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. భారత్ నాలుగు పరుగుల ఆధిక్యతను సాధించింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగారు. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచారు. 124 పరుగులకే అయిదు వికెట్లను కూల్చారు. ఒక దశలో 78 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది టీమిండియా.

ఆ సమయంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ రెచ్చిపోయి ఆడాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని నమోదు చేశాడు. అతని మెరుపు బ్యాటింగ్ కొంతమేర ఊరట ఇచ్చినట్టయింది గానీ అది ఎంతో సేపు నిలువలేదు. పంత్ కూడా అవుట్ అయ్యాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి క్రీజ్‌లో ఉన్నారు.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్- 22, కేఎల్ రాహుల్- 13, శుభ్‌మన్ గిల్- 13, విరాట్ కోహ్లీ- 6, రిషభ్ పంత్- 61 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. స్కాట్ బోలాండ్ నిప్పులు చెరిగే బంతును సంధించాడు. జైస్వాల్, కేఎల్ రాహుల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం విరాట్ కోహ్లీని అతని బలహీనత మీద దెబ్బకొట్టాడు. ఆఫ్ స్టంప్‌కు దూరంగా ఊరించే బంతులను సంధించి అవుట్ చేశాడు.
రిషభ్ పంత్ ఒక్కడే పోరాడాడు. ధాటిగా ఆడాడు. 33 బంతుల్లోనే 61 పరుగులు చేశాడంటే అతని బ్యాటింగ్ వేగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఏకంగా నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉన్నాయి. టీ20 తరహాలో చెలరేగాడు రిషభ్ పంత్. తన ట్రేడ్ మార్క్ హుక్ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరు అతనికే నచ్చలేదు. ఎక్కడో ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తోన్న బంతిని అదే పనిగా వెంటాడి మరీ టచ్ చేసి, క్యాచ్ ఇచ్చాడీ టీమిండియా రన్నింగ్ మిషన్. వదిలేస్తే అలా వెళ్లి వికెట్ కీపర్ చేతుల్లో వాలే బంతి అది. దాన్ని వేటాడి మరీ ఎడ్జ్ తీసుకున్నాడు. స్లిప్స్‌లో స్టీవెన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఆ తరువాత తనను తాను తిట్టుకున్నాడు కోహ్లీ. ఫ్రస్ట్రేషన్‌తో గట్టిగా అరిచాడు. తలను విదిలించాడు. కుడి చేతిని తొడకేసి కొట్టుకున్నాడు. దీని తరువాత కోహ్లీపై ట్రోల్స్ పీక్స్‌కు చేరాయి. అతను జట్టుకు భారంగా మారడంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్. రోహిత్, కోహ్లీ తప్పుకోవాల్సిన సమయం వచ్చిందనీ చెబుతున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications