IND Vs AUS: 369 పరుగులకు భారత్ అలౌట్..!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ లో ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 369 పరుగులకు అలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 358/9 వద్ద నాలుగో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మరో 11 పరుగులు మాత్రమే చేసింది. 114 పరుగులు చేసిన నితీష్ కుమార్ రెడ్డి నాథన్ లయన్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. నితీష్ రెడ్డి ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. భారత ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ 82 పరుగులు చేయగా.. వాషింగ్టన్ సుందర్ 50, విరాట్ కోహ్లీ 36, రిషబ్ పంత్ 28, కేఎల్ రాహుల్ 24, రవింద్ర జడేజా 17 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో కమ్మిన్స్, బోలాండ్, లయన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 474 పరుగులు చేసిన విషయం తెలిసిందే. స్టీవ్ స్మిత్ 140 పరుగులు చేయగా.. లబుషగే 72, కొన్ స్టాస్ 60, కవాజా 57, కమ్మిన్స్ 49 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. ఆసీస్ ఓపెనర్ కొన్ స్టాస్ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. బుమ్రా అతన్ని వెనక్కు పంపాడు.

India all out for 369 in Melbourne Test

ఈ టెస్ట్ లో భారత బౌలర్లు రాణించి ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే కట్టడి చేస్తే గెలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పిచ్ కండిషన్ మారే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా ఈ టెస్ట్ లో సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడికి మంచి భవిష్యత్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇదే క్రమశిక్షణతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. తెలుగు కుర్రాడు ఆస్ట్రేలియాలో సెంచరీ చేయడంపై తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+