ఆసియా కప్ లో ఆ మ్యాచ్ ఉంటుందిరా చారీ..

Asia Cup 2025: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఆసియా కప్ 2025 పూర్తి షెడ్యూల్ వెలువడింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. 28వ తేదీన ఫైనల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ కు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది.

ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. ఆసియా కప్ 2025 షెడ్యూల్ ను ఖరారు చేయడానికి ఢాకాలో సమావేశమైంది ఆసియా క్రికెట్ కౌన్సిల్. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు జరుగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా దీన్ని హోస్ట్ చేయనున్నాయి.

India vs Pakistan match on September 14 at Dubai in Asia Cup 2025

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 కోసం సన్నాహాలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ అదే ఫార్మాట్‌లో జరుగుతుంది. ఈ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొనబోతోన్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్.. తలపడనున్నాయి.

మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో 11 మ్యాచ్ లు అబుధాబిలో జరుగుతాయి. మిగిలిన వాటికి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక. గ్రూప్ దశలో 12, సూపర్ 4లో ఏడు మ్యాచ్ లల్లో ఆయా జట్లు ఢీకొంటాయి. గ్రూప్ దశలో మ్యాచ్ ల మధ్య విరామం అంటూ ఏదీ లేదు. సూపర్ 4లో మాత్రం రెస్ట్ ఇచ్చారు. సెప్టెంబర్ 22వ తేదీ మ్యాచ్ లు ఉండవు.

సెప్టెంబర్ 26 వ తేదీ నాటికి సూపర్ 4 ముగుస్తుంది. 27న విరామం. 28న ఫైనల్స్. ఈ తుదిపోరు కూడా దుబాయ్ స్టేడియంలోనే జరుగుతుంది. సెప్టెంబర్ 14వ తేదీన భారత్- పాకిస్తాన్ తలపడతాయి. ఈ రెండు జట్లూ ప్రత్యర్థులపై విజయాలు సాధించగలిగితే సూపర్ 4లల్లో భారత్- పాకిస్తాన్ ఎదురుపడొచ్చు. ఈ రెండు జట్లు అంచనాలకు తగ్గట్టుగా రాణించగలిగితే ఫైనల్స్ లో ఢీ కొనడం ఖాయమౌతుంది.

ఆసియా కప్ 2025 గ్రూప్స్..

గ్రూప్ ఏ: భారత్, పాకిస్తాన్, యుఎఇ, ఒమన్

గ్రూప్ బీ: శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్

ఆసియా కప్ 2025 పూర్తి షెడ్యూల్..

గ్రూప్ స్టేజ్

సెప్టెంబర్ 9 (మంగళవారం): ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్, అబుదాబి

సెప్టెంబర్ 10 (బుధవారం): భారత్ vs యుఏఈ, దుబాయ్

సెప్టెంబర్ 11 (గురువారం): బంగ్లాదేశ్ vs హాంకాంగ్, అబుదాబి

సెప్టెంబర్ 12 (శుక్రవారం): పాకిస్తాన్ vs ఒమన్, దుబాయ్

సెప్టెంబర్ 13 (శనివారం): బంగ్లాదేశ్ vs శ్రీలంక, అబుదాబి

సెప్టెంబర్ 14 (ఆదివారం): భారత్ vs పాకిస్తాన్, దుబాయ్

సెప్టెంబర్ 15 (సోమవారం): యుఎఇ vs ఒమన్, అబుదాబి

సెప్టెంబర్ 15 (సోమవారం): శ్రీలంక vs హాంకాంగ్, దుబాయ్

సెప్టెంబర్ 16 (మంగళవారం): బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్, దుబాయ్

సెప్టెంబర్ 17 (బుధవారం): పాకిస్తాన్ vs యుఎఇ, అబుదాబి

సెప్టెంబర్ 18 (గురువారం): శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్, దుబాయ్

సెప్టెంబర్ 19 (శుక్రవారం): భారత్ vs ఒమన్, అబుదాబి

సూపర్ 4

సెప్టెంబర్ 20 (శనివారం): గ్రూప్ బి క్వాలిఫైయర్ 1 vs గ్రూప్ బి క్వాలిఫైయర్ 2, దుబాయ్

సెప్టెంబర్ 21 (ఆదివారం): గ్రూప్ ఎ క్వాలిఫైయర్ 1 vs గ్రూప్ ఎ క్వాలిఫైయర్ 2, దుబాయ్

సెప్టెంబర్ 22 (సోమవారం): విశ్రాంతి దినం

సెప్టెంబర్ 23 (మంగళవారం): గ్రూప్ ఎ క్వాలిఫయర్ 1 vs గ్రూప్ బి క్వాలిఫయర్ 2, అబుదాబి

సెప్టెంబర్ 24 (బుధవారం): గ్రూప్ బి క్వాలిఫైయర్ 1 vs గ్రూప్ ఎ క్వాలిఫైయర్ 2, దుబాయ్

సెప్టెంబర్ 25 (గురువారం): గ్రూప్ ఎ క్వాలిఫయర్ 2 vs గ్రూప్ బి క్వాలిఫయర్ 2, దుబాయ్

సెప్టెంబర్ 26 (శుక్రవారం): గ్రూప్ ఎ క్వాలిఫైయర్ 1 vs గ్రూప్ బి క్వాలిఫైయర్, దుబాయ్

సెప్టెంబర్ 27 (శనివారం): సెలవు దినం

ఫైనల్

28 సెప్టెంబర్ (ఆదివారం): ఫైనల్, దుబాయ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+