Asia Cup 2025: సూర్య కుమార్ కు పాకిస్తాన్ టీమ్ కౌంటర్..! సంచలన నిర్ణయం..!

ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్ పై ఘన విజయం తర్వాత ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించడం ద్వారా దేశ భక్తిని చాటుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఆ తర్వాత ఈ టోర్నీలో తనకు లభించిన మ్యాచ్ ఫీజును సైతం పహల్గాం ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నాడు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. దీని నుంచి స్ఫూర్తి పొందారో లేక పోటీగా ఏదో ఒకటి చేయాలని అనుకున్నారో తెలియదు కానీ పాకిస్తాన్ టీమ్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తాజాగా ఓ కీలక నిర్ణయం ప్రకటించాడు. తనతో పాటు తన సహచరులు ఆసియా కప్ ద్వారా లబించిన మ్యాచ్ ఫీజులను భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రభావితమైన పౌరులు, పిల్లలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాడు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టోర్నమెంట్ నుండి తన మొత్తం మ్యాచ్ ఫీజును దేశ సాయుధ దళాలకు మరియు పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు విరాళంగా ఇస్తానని ప్రకటించిన నేపథ్యంలో పాక్ కెప్టెన్ ఈ నిర్ణయం వెల్లడించాడు.

Inspired by Suryakumar Yadav Pakistan Donates to Operation Sindoor Victims

ఓ జట్టుగా, తాము తమ మ్యాచ్ ఫీజులను భారతదేశ దాడి వల్ల ప్రభావితమైన పౌరులు, పిల్లలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ఆఘా మ్యాచ్ తర్వాత వెల్లడించాడు. అదే సమయంలో టీమిండియా పాకిస్తాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పదే పదే నిరాకరించడంపై స్పందిస్తూ... ఇవి నిరాశ పరిచే చర్యలని పేర్కొన్నాడు. తమ చర్యలతో సూర్యకుమార్, ఇతరులు క్రికెట్ క్రీడను అగౌరవపరిచారని ఆరోపించాడు.

Inspired by Suryakumar Yadav Pakistan Donates to Operation Sindoor Victims

మంచి జట్లు వీళ్లు చేసినట్లు చేయవని తమ బాధ్యతలను నెరవేర్చాలని తాము కోరుకున్నాము కాబట్టి ట్రోఫీతో ఒంటరిగా పోజులిచ్చామని తెలిపాడు. తాము అక్కడే నిలబడి పతకాలను తీసుకున్నామని వెల్లడించాడు. తాను కఠినమైన పదాలు ఉపయోగించకూడదనుకుంటున్నాను కానీ వారు చాలా అగౌరవంగా ప్రవర్తించారన్నారని భారత్ పై తన ఆక్రోశం వెళ్లగక్కాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+