ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ తేదీ కన్‌ఫర్మ్: రెండున్నర నెలల క్రికెట్ జాతర
IPL 2024: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న మెగా ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ సమీపించింది. ఈ బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. మొత్తం 10 జట్లు పోరాడనున్నాయి. రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బిగ్గెస్ట్ టోర్నమెంట్ ఇది.
దీనికోసం సన్నాహకాలు సాగుతున్నాయి. అన్ని ఫ్రాంఛైజీలు తమ జట్లను సరికొత్తగా రూపుదిద్దుకున్నాయి. గెలుపు గుర్రాలను జట్టులోకి తీసుకున్నాయి. ఇప్పటికే మెగా ఆక్షన్ ముగిసింది కూడా. ఈ వేలం పాట తరువాత అన్ని ఫ్రాంఛైజీల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చాలామంది ప్లేయర్లు అటు ఇటు అయ్యారు. కొత్త ఫ్రాంఛైజీల తరఫున ఆడబోతోన్నారు.

రోహిత్ శర్మకు బదులుగా ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని వహించనున్నాడు. రెండు సీజన్లల్లో గుజరాత్ టైటాన్స్‌కు సారథ్యాన్ని వహించిన హార్దిక్ పాండ్యాను ఈ దఫాలో ముంబై ఇండియన్స్ ఎగరేసుకెళ్లిన విషయం తెలిసిందే. రోహిత్ కంటే హార్దిక్ కేప్టెన్సీలోనే జట్టు మెరుగ్గా రాణించగలదని భావించిందీ ఫ్రాంఛైజీ.
హార్దక్ ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోవడంతో.. అతని స్థానాన్ని శుభ్‌మన్ గిల్‌తో భర్తీ చేసింది గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు గిల్ కేప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్సీలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఎయిడెన్ మార్క్‌రమ్ బదులుగా ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ పాట్ కమ్మిన్స్ పగ్గాలను అందుకునే అవకాశం ఉంది.
అదే సమయంలో కొందరు స్టార్ ఆటగాళ్లు ఈ సీజన్‌కు దూరం కానున్నారు. ఈ సీజన్‌లో ఆడట్లేదంటూ ఇప్పటికే ఇంగ్లాండ్ ప్లేయర్లు జో రూట్, బెన్ స్టోక్స్ ప్రకటించారు. గాయం కారణంగా హార్దిక్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఫిట్‌నెస్ కోసం అతను కష్టపడుతున్నాడు.
ఈ పరిస్థితుల మధ్య- ఐపీఎల్ 2024 సీజన్ మొదలయ్యే తేదీ వెలువడింది. మార్చి 22వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తుంది. మే చివరి వారం వరకూ కొనసాగుతుంది. ఓపెనింగ్ సెరిమనీని గ్రాండ్‌గా నిర్వహించనుంది ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ.












Click it and Unblock the Notifications