IPL 20226: ముంబై ఓడిపోతున్న వేళ ఆకాష్ అంబానీ ఫ్రస్ట్రేషన్ - వీడియో వైరల్..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో భాగంగా నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఘోర పరాజయం పాలైంది. ఏకంగా 104 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ చరిత్రలోనే తమ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ముంబై ప్లేయర్ల ప్రదర్శన ఈసారి జట్టు యాజమాన్యానికి సైతం ఆగ్రహం తెప్పించింది. ముఖ్యంగా మ్యాచ్ చివర్లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

MI vs CSK: ముంబైకి బిగ్ బూస్ట్- సీఎస్కే మ్యాచ్ కు స్టార్ ఆల్ రౌండర్ ఎంట్రీ.!
MI vs CSK: ముంబైకి బిగ్ బూస్ట్- సీఎస్కే మ్యాచ్ కు స్టార్ ఆల్ రౌండర్ ఎంట్రీ.!

సీఎస్కేతో జరిగిన మ్యాచ్ లో 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఆరంభం నుంచీ ముంబై ఇండియన్స్ బ్యాటర్లు అఫసోపాలు పడ్డారు. వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. అలాగని చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ అంత అద్బుతంగా ఉందా అంటే అదేమీ లేదు. సాధారణ బౌలర్లకు సైతం ముంబై ఇండియన్స్ బ్యాటర్లు చెత్త షాట్లు ఆడి వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. ఇదంతా చూస్తున్న ముంబై ఇండియన్స్ యాజమాని ఆకాష్ అంబానీకి చిర్రెత్తుకొచ్చింది. దీంతో మ్యాచ్ ముగియకముందే ఆకాష్ తన ఫ్రస్ట్రేషన్ అంతా చూపించారు.

IPL 2026 Akash Ambani Walks Out Mid-Match as MI Suffer Worst-Ever Defeat Bowled Out for 104 vs CSK
CSK vs MI: సీఎస్కే చేతిలో దారుణ ఓటమి అందుకే-తేల్చేసిన హార్దిక్ పాండ్యా..!
CSK vs MI: సీఎస్కే చేతిలో దారుణ ఓటమి అందుకే-తేల్చేసిన హార్దిక్ పాండ్యా..!

ముంబై ఇండియన్స్ ఆలౌట్ కావడానికి ముందే ఆకాష్ అంబానీ తన సీట్లో నుంచి లేచి ఇంటికి బయలుదేరారు. అంతే కాదు ముంబై ఆటతీరుపై తన విసుగు అంతా ప్రదర్శించారు. విసురుగా నడుస్తూ మధ్యలో మ్యాచ్ చూస్తున్న ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ను సైతం ఇంకే చూస్తున్నారు, ఇల చాల్లెండి అన్నట్లుగా సైగలు చేశారు. దీంతో వారు కూడా కేకలు పెట్టడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీన్ని చూసిన ఫ్యాన్స్.. అప్పుడే ఏమైంది.. సినిమా ఇంకా చాలా ఉందని సెటైర్లు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+