Ishan Kishan: రాజస్థాన్ మ్యాచ్ తెచ్చిన మార్పు-ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం..!
నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన కీలకమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఈ మ్యాచ్ కు ముందు ఐపీఎల్ 2026 ( IPL 2026)లో ఆడిన నాలుగు మ్యాచ్ లలో కేవలం ఒకటే గెలిచి మూడు మ్యాచ్ లు ఓడిపోయిన సన్ రైజర్స్ కు రాజస్థాన్ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో ఇద్దరు యువ బౌలర్లను అరంగేట్రం చేయించడమే కాకుండా అనుకున్న ఫలితం కూడా రాబట్టుకొన్న కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan)
.. అదే సమయంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్‌పై .. సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల భారీ విజయం సాధించిన అనంతరం, ఇషాన్ కిషన్ ఒక కీలకమైన వ్యూహాత్మక మార్పు గురించి సూచనప్రాయంగా చెప్పాడు. ఐపీఎల్ 2026లో కెప్టెన్సీపై మరింత దృష్టి పెట్టేందుకు వికెట్ కీపింగ్ బాధ్యతలను వదులుకోవచ్చని కిషన్ వెల్లడించాడు. ఐపీఎల్ ప్రారంభంలో ఎదురైన ఎదురుదెబ్బల తర్వాత, కిషన్ 44 బంతుల్లో మెరుపు వేగంతో 91 పరుగులు చేసి ముందుండి నడిపించడంతో, SRH 6 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ నేపథ్యంలో బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీ, వికెట్ కీపింంగ్ బాధ్యతల్ని భారంగా భావిస్తున్న ఇషాన్ కిషన్.. ఇందులో కీపింగ్ వదిలేయాలని భావిస్తున్నాడు. కేవలం తన బ్యాటింగ్ తో పాటు కెప్టెన్సీ బాధ్యతలు చూసుకుంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చనే నిర్ణయానికి వచ్చాడు. అందుకే రాజస్తాన్ తో మ్యాచ్ లో కీపింగ్ నుంచి తప్పుకుని యువ కీపర్ సలీల్ అరోరాను నిలబెట్టాడు. ఈ ప్లాన్ వర్కవుట్ కావడంతో రాబోయే మ్యాచ్ లలోనూ కిషాన్ కీపింగ్ కు దూరంగా ఉండబోతున్నాడు. అందుకే
వికెట్ కీపింగ్ బాధ్యతల నుండి తప్పుకోవాలనేది ముఖ్యమైన వ్యూహాత్మక నిర్ణయం అని తెలిపాడు.

మైదానంలో సమన్వయం, అమలును మెరుగుపరచడమే ఈ నిర్ణయం లక్ష్యమని కిషన్ వెల్లడించాడు. కెప్టెన్‌గా, కొన్నిసార్లు సమన్వయ లోపం ఉందని భావించానని, కీపింగ్ చేస్తున్నప్పుడు జట్టు ప్రణాళికలపై బౌలర్లతో మాట్లాడేందుకు వీలు కావడం లేదన్నాడు. అక్కడే ఉండి, వారు ఏమి బౌలింగ్ చేయబోతున్నారో చర్చించి, దానికి అనుగుణంగా ఫీల్డింగ్‌ను సెట్ చేయడం మంచిదన్నాడు. అదే ప్రణాళిక బాగా పనిచేసిందని భావిస్తున్నట్లు తెలిపాడు. అందుకే భవిష్యత్తులో దీన్ని కొనసాగిస్తానన్నాడు.












Click it and Unblock the Notifications