హార్దిక్ తో తగాదాల పై ఓపెన్ అయిన కృనాల్, అసలు కారణం..!!
IPL 2026: కృనాల్- హార్దిక్ మధ్య విబేధాల పై కొంత కాలంగా చర్చ సాగుతోంది. గతంలో ఈ ఇద్దరు ముంబాయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు వేర్వేరు జట్లలో ఉన్నారు. ఇద్దరు తమ టీంల కు ప్రాతినిధ్యం వహిస్తూనే.. తమ మధ్య బంధం మాత్రం బలమైనదని ప్రతీ సందర్భంలో నిరూపించుకున్నారు. అయితే, కొద్ది రోజులుగా వారిద్దరి మధ్య గొడవలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఆర్సీబీ - ముంబాయి మ్యాచ్ లో హార్దిక్ అవుట్ సమయంలో కృనాల్ తీరు సైతం అదే విధంగా ఉంది. ఇప్పుడు అసలు ఈ ఇద్దరి గ్యాప్ పై కృనాల్ స్పష్టత ఇచ్చారు.
కృనాల్ పాండ్యా - హార్దిక్ పాండ్యా. ఈ ఇద్దరు ప్రస్తుత ఐపీఎల్ లో వేర్వేరు టీంలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలోనూ ఇదే రకంగా ఉన్నా.. గ్రౌండ్ లో మాత్రం ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే.. తాజాగా ముంబాయిలో బెంగళూరు వర్సస్ ముంబాయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఇద్దరి తీరు ఇప్పడు సోషల్ మీడియాలో చర్చగా మారింది. మ్యాచ్ జరుగుతు త సేపు ఇద్దరు సోదరులు ఒకరినొకరు కనీసం కళ్లలోకి కూడా చూసుకోలేదు. హార్దిక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆర్‌సీబీ తరపున ఫీల్డింగ్ చేస్తున్న కృనాల్ చాలా దూరం మెయింటైన్ చేశారు. వీరిద్దరి మధ్య గతంలో ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు ఇసుమంతైనా కనిపించలేదు. కాగా, హార్దిక్ పాండ్యా అవుట్ అయినప్పుడు కృనాల్ చాలా దూకుడుగా సంబరాలు చేసుకున్నారు. గాలిలోకి ఎగురుతూ, ఆవేశంగా అరుస్తూ ఆయన చేసిన హంగామా పైన సోషల్ మీడియాలో నెటిజెన్లు స్పందిస్తున్నారు.

తేల్చి చెప్పిన కృనాల్
ప్రత్యర్థి జట్టులో కీలక ఆటగాడు అవుట్ అయితే సంబర పడటం సాధారణమే అయినా... ఇక్కడ, కృనాల్ ప్రవర్తన అతిగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో గతంలో వెలుగు లోకి వచ్చిన విభేదాలే ఇప్పటికీ వీరిద్దరి మధ్య గ్యాప్ కు కారణమనే విశ్లేషణలు మొదలు అయ్యాయి. దీని పైన కృనాల్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. 'మీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉందా? లేదా ఏమైనా గొడవలు జరుగుతున్నాయా.. అనే ప్రశ్నకు కృనాల్ ఒక్కసారిగా నవ్వేశాడు. "అంతా బాగానే ఉంది" అని కృనాల్ నవ్వుతూ బదులిచ్చాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసాడు. అయితే, సోషల్ మీడియాలో మాత్రం పాండ్యా బ్రదర్స్ మధ్య విభేదాలు.. అందుకు కారణాల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు కృనాల్ స్పష్టత ఇవ్వటంతో ఇక ఈ చర్చ ఆగుతుందా లేదా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications