మావాడొచ్చాడు.. ఇప్పుడు రండ్రా చూసుకుందాం
Jasprit Bumrah: ఐపీఎల్ 2025లో వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో గెలిచింది ఒక్కటే. తన మూడో మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టు వరుస ఓటములకు పుల్ స్టాప్ పడింది గానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది.
లక్నో సూపర్ జెయింట్స్‌పై జరిగిన ఈ తరువాతి మ్యాచ్‌లో మళ్లీ ఓడింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఖాతాలో ఉన్న పాయింట్ల సంఖ్య రెండు మాత్రమే. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిందా టీమ్. దీని తరువాత చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు మాత్రమే ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టబోతోంది ముంబై ఇండియన్స్. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. వాంఖెడే స్టేడియం దీనికి వేదిక. ఇందులో- భారీ రన్‌రేట్‌తో గెలిస్తే గానీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకోలేని స్థితి ఆ జట్టుది.
ఈ పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్‌కు గ్రేట్ న్యూస్ అందింది. బౌలింగ్ బ్యాక్ బోన్ జస్‌ప్రీత్ బుమ్రా.. జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడటం దాదాపుగా ఖాయమైంది. ప్రస్తుతం అతను వందశాతం ఫిట్‌నెస్‌తో ఉన్నాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ మెడికల్ టీమ్ తెలిపింది.
మూడు నెలల కిందట బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ మధ్యలో గాయం వల్ల తప్పుకొన్నాడు జస్‌ప్రీత్ బుమ్రా. మధ్యలో ఛాంపియన్స్ ట్రోఫీకీ దూరం అయ్యాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌లల్లోనూ ఆడలేదు. ఈ మూడు నెలల పాటు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలేషన్‌లో గడిపాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు.
ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో రెండింట్లో ప్రత్యర్థులు భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ 203, అంతకుముందు గుజరాత్ టైటాన్స్ 196 పరుగులు చేశాయి. దీన్ని కొట్టలేకపోయారు బ్యాటర్లు. ఇక్కడే బౌలింగ్ వైఫల్యం అనేది స్పష్టంగా కనిపించింది. ఒక్క కోల్‌కత నైట్ రైడర్స్‌పై మాత్రమే ముంబై బౌలర్లు రాణించారు. ఆ జట్టును 116 పరుగులకే కట్టడి చేశారు.
ఈ నాలుగు మ్యాచ్‌లల్లో జస్‌ప్రీత్ బుమ్రా ఆడలేదు. ఈ పరిణామాల మధ్య జస్‌ప్రీత్ బుమ్రా ఆ జట్టుకు అందుబాటులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు తొలుత బ్యాటింగ్‌కు దిగినా లేదా బంతిని అందుకున్నా బౌలింగ్ డిపార్ట్‌మెంట్ రాటుదేలుతుందని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
ముంబై ఇండియన్స్ తుదిజట్టులో- రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కేప్టెన్), నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, విఘ్నేష్ పుథూర్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications