టీమిండియా సెమీస్ చేరదు, రాసి పెట్టుకోండి..ఇదీ లెక్క - పాక్ క్రికెటర్ అక్కసు..!!
T20 World cup: టీ20 ప్రపంచ కప్ కీలక దశకు చేరుకుంది. సూపర్ -8 మ్యాచ్ లు ప్రారంభం వేళ.. ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు మైండ్ గేమ్ మొదలు పెట్టారు. సూపర్ -8 దశలో టీమిండియా కీలక జట్లతో తల పడనుంది. ప్రతీ మ్యాచ్ కీలకంగా మారుతోంది. సూపర్ -8 దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్ కు చేరుతాయి. అయితే, అసలు టీమిండియా సెమీ ఫైనల్స్ కు చేరే అవకాశమే లేదని పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ వ్యాఖ్యలకు క్రికెట్ ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. అసలు.. సెమీస్ కు చేరే అవకాశం ఏ జట్లకు ఉంది.. ఏంటి లెక్కలు...
సూపర్ -8 మ్యాచ్ లు ప్రారంభం వేళ పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా సెమీస్ చేరే అవకాశాలు లేవంటూ అక్కడు వెళ్ల గక్కాడు. కాగా.. ప్రపంచ కప్ ఈవెంట్ లో భారత్ - పాక్ టాపర్లు గా సూపర్ -8 చేరుకున్నాయి. లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ ను ఓడించి టీమిండియా అజేయంగా నిలవగా , పాక్ మిగిలిన జట్లను ఓడించి... భారత్ చేతిలో పరాభవం తప్పించుకోలేక పోయింది.

ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక సూపర్ -8 లో భారత్ జట్టు... దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ తో తల పడనుంది. పాక్ జట్టు.. న్యూజీలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకతో తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో మహ్మద్ అమీర్ భారత్ పైన మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. పాక్ తో మ్యాచ్ తో మినహా.. లీగ్ దశలో మిగిలిన మ్యాచ్ ల్లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుప్ప కూలింది. దీంతో, ఈ జట్టు సెమీస్ చేరే అవకాశాలు లేవని చెప్పాడు.
సెమీస్ కు చేరే జట్ల పై జోస్యం
మరో వైపు, దక్షిణాఫ్రికా.. వెస్టిండీస్ మాత్రం అద్భుతంగా అడుతున్నాయని.. ఏ జట్టు అయినా ఓడించే సత్తా ఆ జట్లకు ఉన్నాయని.. కాబట్టి సెమీస్ చేరే అవకాశాలు ఈ జట్టుకే ఉన్నాయని వ్యాఖ్యానించాడు. దీంతో.. అమీర్ వ్యాఖ్యల పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. భారత్ ను కించ పరిచేలా చూస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు.
కాగా.. సూపర్ 8 లో గ్రూపు -1 నుంచి భారత్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ పోటీ పడుతుండగా.. గ్రూపు -2 నుంచి న్యూజీలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్థాన్ బరిలో ఉన్నాయి. 2024 లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన తరువాత టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లలో వరుస విజయాలు సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలో నిలిచింది. దీంతో.. ఇప్పుడు ఇక క్రికెట్ ఫ్యాన్స్ కు సూపర్ -8 దశలో జరిగే ప్రతీ మ్యాచ్ మజా అందించటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications