ఐపీఎల్ 2024 ముంగిట్లో ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17వ ఎడిషన్ ప్రారంభ తేదీ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదిక. ఈ వారంలోనే ఐపీఎల్ మొదలుకాబోతోంది. వచ్చే శుక్రవారం నాడే తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. రెండున్నర నెలల పాటు అంటే 74 రోజుల పాటు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించబోతోంది.
తొలి మ్యాచ్‌లో
ఈ నెల 22వ తేదీన రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్ జరుగనుంది. గత సీజన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతోంది. ఈ రెండింటికీ ప్రతిష్ఠాత్మకంగా మారిన మ్యాచ్ ఇది. తొలి మ్యాచ్ నుంచే జైత్రయాత్ర మొదలుపెట్టాలనే పట్టుదలతో ఉన్నాయవి. చెన్నైలోని చెపాక్‌లో గల ఎంఏ చిదంబరం స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

బంగ్లాదేశ్‌తో..
ఈ పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ దిల్షాన్ మధుశనక గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో రెండో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో అతనికి గాయమైంది. ఏడో ఓవర్ వేస్తూ హ్యామ్‌స్ట్రింగ్ గాయం వల్ల మధ్యలోనే తప్పుకొన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగే మిగిలిన మ్యాచ్‌ల నుంచి వైదొలగాల్సి వచ్చింది. మరో అయిదు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024లోనూ కొన్ని మ్యాచ్‌లకు మధుశనక దూరం కానున్నాడు.
ధృవీకరించిన లంక టీమ్ మేనేజ్‌మెంట్..
మధుశనక గాయపడ్డ విషయాన్ని శ్రీలంక జట్టు మేనేజర్ మహింద హలంగోడ ధృవీకరించారు. కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఖచ్చితంగా తెలియ రావట్లేదని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ టోర్నమెంట్‌లో కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని మహింద అంచనా వేశారు.

బలమైన బౌలింగ్..
డిసెంబర్‌లో జరిగిన మెగా ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ అతణ్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 4.6 కోట్ల రూపాయలకు జట్టులోకి తీసుకుంది. మధుశనకతో కలిసి జస్‌ప్రీత్ బుమ్రా, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, గెరాల్డ్ కోయెట్జీ, ఆకాష్ మధ్వల్, అర్జున్ టెండూల్కర్, తుషారతో కలిసి బలమైన ఫాస్ట్-బౌలింగ్ లైనప్‌ను ఏర్పాటు చేసుకుంది. మధుశంక తప్పుకోవాల్సి రావడం బౌలింగ్ లైనప్‌ను ప్రభావితం చేయొచ్చు.












Click it and Unblock the Notifications