టీ20 వరల్డ్ కప్ పై తేల్చేసిన పాక్-భారత్ కు షాక్.! సంచలన ప్రకటన..!
భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ ఈ నెల 7న ప్రారంభం కాబోతోంది. ఇలాంటి సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఈ టోర్నీలో భాగంగా భారత్ లో జరిగే మ్యాచ్ లు ఆడేందుకు నిరాకరించడంతో స్కాట్లండ్ కు ఐసీసీ అవకాశం కల్పించింది. దీంతో బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్ (pakistan) ఈ టోర్నీని బహిష్కరించడం కానీ లేదా భారత్ తో మ్యాచ్ ఆడకుండా దూరంగా ఉంటామని ప్రకటించింది. దీనిపై ఇవాళ తుది నిర్ణయం తీసుకుంది.
టోర్నీ ఆడుతూ భారత్ మ్యాచ్ బాయ్ కాట్
వచ్చే వారం ప్రారంభమయ్యే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ఆడాలని పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. అయితే తమ చిరకాల ప్రత్యర్థి అయిన భారత్ తో జరిగే గ్రూప్ దశ మ్యాచ్ ను మాత్రం బహిష్కరించాలని నిర్ణయించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్.. భారత్ లో మ్యాచ్‌లు ఆడటానికి నిరాకరించిన నేపథ్యంలో ఐసీసీ బంగ్లాదేశ్‌ను ఈ టోర్నమెంట్ నుండి తొలగించిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఎలాంటి కారణం లేకుండానే
భారత్-పాక్ మ్యాచ్ లన్నీ తటస్థ వేదికలో నిర్వహించాలని, ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ మధ్య ముందస్తు ఒప్పందం ఉంది. కానీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ను మాత్రం భారత్ లో నిర్వహిస్తుండటంతో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఏకంగా పాకిస్తాన్ ప్రభుత్వమే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అలాగే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాన్ని సైతం వెల్లడించలేదు.
పాకిస్తాన్ సర్కార్ ప్రకటన
ఐసీసీ వరల్డ్ టీ20లో పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని సర్కార్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఫిబ్రవరి 15న భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మైదానంలోకి దిగదని వెల్లడించింది. పాకిస్తాన్ ప్రకటనపై ఐసీసీ అధికారికంగా స్పందించలేదు. అయితే తమకు దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఐసీసీ వర్గాలు తెలిపాయి. అలాగే బీసీసీఐ కూడా తమకు దీనిపై సమాచారం లేదని వెల్లడించింది.

పాక్ కు తీవ్ర పరిణామాలు ?
పాకిస్తాన్ తమ నిర్ణయానికి కట్టుబడితే పరిణామాలు తీవ్రంగానే ఉండబోతున్నాయి. ఐసీసీ ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారం మ్యాచ్ ఆడని జట్టు పూర్తి 20 ఓవర్ల ఇన్నింగ్స్ ఆడినట్లుగా పరిగణిస్తారు. ఆ ఓవర్లను జట్టు ఓవర్‌కు సగటు పరుగులను లెక్కించేటప్పుడు లెక్కిస్తారు. ఫలితంగా వారి నెట్ రన్ రేన్ నష్టపోతారు. అలాగే పాకిస్తాన్‌పై ఐసీసీ కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. భారత్ తో మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరిస్తే దాని ప్రభావం ఐసీసీ ఆదాయంపై గణనీయంగా పడనుంది. దీనికి ప్రతిగా ఐసీసీ పీసీబీకి ఇచ్చే 34.5 మిలియన్ డాలర్లను నిలిపేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications