సీఎస్కే వదిలేశాక ధోనీతో మాటల్లేవ్ ..! రవీంద్ర జడేజా షాకింగ్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న టాప్ జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (mahendra singh dhoni) ఎంత పాపులరో.. అతని మాజీ సహచరుడు రవీంద్ర జడేజా (Ravindra jadeja) కూడా అంతే పాపులర్ అయ్యాడు. దాదాపు దశాబ్దం పాటు సీఎస్కేలో కొనసాగిన వీరిద్దరీ జోడీ తాజాగా బ్రేక్ అయింది. దీనికి కారణం రవీంద్ర జడేజాను తమ టీమ్ లోకి తీసుకున్న రాజస్థాన్ రాయల్స్.. అందుకు బదులుగా కెప్టెన్ గా ఉన్న సంజూ శాంసన్ ను ఇచ్చేయడమే.
అయితే గతంలో పదుల సంఖ్యలో మ్యాచ్ లలో కలిసి ఆడిన మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజాకు మైదానంలో పిచ్చిపిచ్చిగా జోకులు కూడా వేసుకుంటారనే పేరు కూడా ఉంది. అయితే అంత సాన్నిహిత్యం కూడా ఉన్న వీరిద్దరి జోడీ ఇప్పడు జడేజా టీమ్ మార్పుతో విడిపోయినట్లయింది. నిన్న జడేజా పాత జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పై ప్రస్తుతం అతను ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతంగా ఆడి విజయం నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ధోనీ లేడు. అయినా ధోనీతో అనుబంధం, చెన్నైను వీడిపోయిన తర్వాత అతనితో సంబంధాలపై అడిగిన ప్రశ్నకు జడేజా షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.

13 ఏళ్ల పాటు తాను ఆడిన జట్టుపై ఇప్పుడు ప్రత్యర్థిగా బరిలోకి దిగడం వింతగా అనిపించినట్లు రవీంద్ర జడేజా వెల్లడించాడు. అంతే కాదు ఈ మ్యాచ్ సందర్భంగా కూడా మహేంద్ర సింగ్ ధోనీతో తాను మాట్లాడలేదని తెలిపాడు. ఆ మాట కుస్తే సీఎస్కే నుంచి విడిపోయాక తాను ధోనీతో మాట్లాడలేదని చెప్పుకొచ్చాడు. మహీ తన ఫోన్ స్విచాఫ్ చేసి ఉంచుతాడు కాబట్టి కాల్ చేయలేదంటూ షాకింగ్ రీజన్ చెప్పాడు. ఈ మ్యాచ్ సందర్భంగా ధోనీతో మాట్లాడలేదని, అయితే భవిష్యత్తులో కలిసినప్పుడు మాత్రం అన్ని విషయాలు మాట్లాడుకుంటామని జడేజా చెప్పుకొచ్చాడుచ.












Click it and Unblock the Notifications