వీళ్లిద్దరూ ఆడితే.. వార్ వన్ సైడే: గంభీర్ ముఖచిత్రం ఏంటో?

ఆస్ట్రేలియాతో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ లో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 236 పరుగులను అలవోకగా కొట్టి అవతల పడేసింది. తొలి రెండు వన్డేలను ఎగరేసుకెళ్లిన ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ లో టీమిండియా చుక్కలు చూపించింది. అసలు సిసలు ఆటతీరును ప్రదర్శించింది. గెలుస్తామనే ఆశ కూడా చిగురించకుండా చితగ్గొట్టింది. ఏకపక్షంగా విజయం సాధించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగింది ఆస్ట్రేలియా. దూకుడుగా ఆడింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిఛెల్ మార్ష్ తొలి ఓవర్లల్లో దుమ్ము లేపారు. సగటున ఓవర్ కు ఆరు చొప్పున పరుగులను రాబట్టుకున్నారు. ఒకదశలో 33 ఓవర్లలో మూడు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 183 పరుగులు సాధించింది. డెత్ ఓవర్లల్లో ఆస్ట్రేలియా బ్యాటర్లు మరింత ధాటిగా ఆడుతుందని భావించారు. ఆ దశలో బౌలర్లు రెచ్చిపోయారు. హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 8.4 ఓవర్లు వేసిన హర్షిత్ రాణా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇది అతని కేరీర్ బెస్ట్ బౌలింగ్.

Rohit Sharma and Virat Kohli pair now has the third-most century stands in ODIs

ఆస్ట్రేలియా ఇన్నింగ్ లో మాట్ రెన్ షా, కేప్టెన్ మిఛెల్ మార్ష్ మాత్రమే రాణించారు. రెన్ షా హాఫ్ సెంచరీ చేశాడు. 58 బంతుల్లో రెండు ఫోర్లతో 56 పరుగులు కొట్టాడు. మార్ష్- 41, ట్రావిస్ హెడ్- 29, మాథ్యూ షార్ట్- 30, అలెక్స్ క్యారీ- 24, కూపర్ కొన్నొల్లి- 23, మిఛెల్ ఓవెన్- 1, మిఛెల్ స్టార్క్- 2, నాథన్ ఎల్లిస్- 16, ఆడమ్ జంపా- 2 (నాటౌట్) రన్స్ చేశారు. వాషింగ్టన్ సుందర్- 2 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్, కుల్ దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్.. వార్ ను వన్ సైడ్ చేసింది. 38.3 ఓవర్లలోనే 287 పరుగులు సాధించింది. ఈ క్రమంలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. కేప్టెన్ శుభ్ మన్ గిల్ 24 పరుగులు చేసి హేజిల్ వుడ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. జట్టు స్కోరు 69 పరుగుల వద్ద ఉన్నప్పుడు పడ్డ వికెట్ అది. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. 125 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, 13 బుల్లెట్ల వంటి ఫోర్లతో 121 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ ఈ గేమ్ లో తనదైన స్టైల్ లో రెచ్చిపోయాడు. 81 బంతుల్లో ఏడు ఫోర్లతో 74 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై 2,500 అంతకుమించి పరుగులు కొట్టిన రెండో బ్యాటర్ అతనొక్కడే. ప్రస్తుతం ఈ రికార్డు శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కార పేరు మీద ఉంది.

ఈ ఇన్నింగ్ తో వారిద్దరూ కమ్ బ్యాక్ అయినట్టే. 2027 ఐసీసీ వరల్డ్ కప్ కోసం జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టే. ఈ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఓ హాఫ్ సెంచరీ, సెంచరీ చేశాడు రోహిత్ శర్మ. తొలి మ్యాచ్ లో ఎనిమిది పరుగులతో సరిపెట్టుకున్నప్పటికీ.. ఆ తర్వాతి రెండు గేమ్ లల్లో విజృంభించాడు. 73, 121 పరుగులు కొట్టాడు. వీరిద్దరి 19వ సెంచరీ పార్ట్ నర్ షిప్ ఇది. రెండో అత్యధిక సెంచరీ భాగస్వామ్యం వీరిద్దరి పేరు మీదే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+