T20 World Cup 2024: రోహిత్ మనసులో ఇప్పటికే 10 మంది ? సెలక్షన్ పై కీలక వ్యాఖ్యలు..!
ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే టీ20ల్లో అదరగొడుతున్న టీమిండియా ఈ మెగాటోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతోంది. అయితే టీ20 వరల్డ్ కప్ కు సన్నాహకంగా తాజాగా ఆప్ఘనిస్తాన్ తో స్వదేశంలో మూడు మ్యాచ్ ల సిరీస్ కూడా ఆడిన రోహిత్ సేన.. వైట్ వాష్ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికపై ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి.
ఆప్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ ను 3-0తో వైట్ వాష్ చేసిన తర్వాత టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు ప్రదర్శనపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో జట్టు ఎంపిక అధికారికంగా ఇంకా జరగకపోయినా తన మనసులో మాటను కెప్టెన్ రోహిత్ శర్మ అధికారిక బ్రాడ్ కాస్టర్ జియో సినిమాతో పంచుకున్నాడు. ఇందులో రోహిత్ మనసులో ఇప్పటికే దాదాపు 10 మంది ఆటగాళ్లు ఉన్నట్లు స్పష్టమైంది. మిగతా ఆటగాళ్ల ఎంపిక కోసమే ప్రయత్నాలు చేస్తున్నట్లు రోహిత్ పరోక్షంగా వెల్లడించాడు.

టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు ఎంపికపై స్పందించిన రోహిత్ శర్మ.. ఇంకా అధికారికంగా జట్టు ఎంపిక జరగలేదని, అయితే
పూల్ లో 25-30 మంది ఆటగాళ్లు ఉన్నారని, ఇందులో 8-10 మంది ఆటగాళ్లు ఇప్పటికే తన మనసులో ఉన్నారన్నారు. వన్డే వరల్డ్ కప్ తరహాలోనే టీ20ల్లోనూ చాలా మంది ఆటగాళ్లను ఇప్పటికే పరీక్షించినట్లు రోహిత్ చెప్పుకొచ్చాడు. వీరిలో కొందరు తప్పుకోవాల్సిందేనని, అయితే తాము మాత్రం జట్టుపై క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ కు ఆతిధ్యమిచ్చే వెస్టిండీస్ స్లో పిచ్ లను దృష్టిలో ఉంచుకుని జట్టు ఎంపిక ఉంటుందన్నాడు.












Click it and Unblock the Notifications