మనోడు మళ్లీ మొదటికొచ్చాడు భయ్యా- ట్రీట్మెంట్ ఇస్తే గానీ
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్‌లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది ఈ సీజన్‌లో వరుసగా రెండో ఓటమి. అంతుకుముందు జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో కూడా ఓడిపోయిందీ ఎల్లో ఆర్మీ. పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. హ్యాట్రిక్ దిశగా సాగుతోందా జట్టు ప్రస్థానం. తన హోమ్ గ్రౌండ్ లో వరుసగా ఆరు మ్యాచ్ లల్లో ఓడిపోయింది.
చెన్నై చెపాక్ ఎంఏ చిదంబరం స్టేడియంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పంజాబ్ కింగ్స్. తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ మళ్లీ విఫలం అయ్యాడు. ఏడు పరుగులకే అవుట్ అయ్యాడు. మరోసారి నిరాశపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లోనూ సంజు విఫలమైన విషయం తెలిసిందే. ఆరు పరుగులకే వెనుదిరిగాడు.

ఇది విమర్శలకు దారి తీస్తోంది. రాజస్థాన్ రాయల్స్ నుండి శాంసన్ చెన్నైకి మారడం పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సీఎస్కేతో ఓ కొత్త శకంలోకి అడుగుపెడుతున్నాడనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. టీ20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న నేపథ్యంలో ఈ అంచనాలు మరింత పెరిగాయి. అవన్నీ నీరుగారినట్టయింది. మొదటి రెండు మ్యాచ్‌లలో వరుసగా 6, 7 పరుగులు మాత్రమే చేయడం అతని ఫామ్‌పై తీవ్ర చర్చకు దారితీసింది.
అయినప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్ లో అతని పట్ల పెద్దగా ఆందోళన లేదు. శాంసన్ కెరీర్ తరచుగా ఇలానే సాగుతుందని, ప్రారంభంలో మందకొడిగా ఆడే అతను ఆ తర్వాత గేర్ మార్చుతాడని ఆశిస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో కూడా ప్రారంభంలో పెద్దగా ప్రభావం చూపలేదు సంజు శాంసన్. ఆ తర్వాత విరుచుకుపడ్డాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్లేఆఫ్స్, సెమీస్, ఫైనల్ లో హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలుచుకున్నాడు. ఇప్పుడు కూడా అలాగే ఆడొచ్చని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెబుతున్నాడు.
-
అభిషేక్ శర్మకు IPLయాజమాన్యం భారీ షాక్- అదే వద్దు, తగ్గించుకోకుంటే..ఇక..!! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
'ధురందర్’ స్టెప్పుతో సూర్యకుమార్ యాదవ్ రచ్చ! వీడియో -
ఎన్నికల ప్రచారంలో సంజూ శాంసన్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!!












Click it and Unblock the Notifications