IND vs SA: సిరీస్ డిసైడర్ మ్యాచ్ కు సీనియర్ ఔట్, డేంజరస్ ఆల్ రౌండర్ ఎంట్రీ..!!
IND Vs SA T20: టీ20 సిరీస్ విజేత ఎవరు. దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదవ, నిర్ణయాత్మక టీ20 మ్యాచ్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. లక్నోలో జరగాల్సిన మ్యాచ్ మంచు కారణంగా రద్దు అయింది. దీంతో, అహ్మదాబాద్ వేదికగా జరిగే చివరి మ్యాచ్ లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని సూర్య టీం భావిస్తోంది. ఈ మ్యాచ్ లో గెలవటం ద్వారా సిరీస్ సమయం చేయాలనేది సౌతాఫ్రికా టీం లక్ష్యంగా ఉంది. అయితే.. ఈ మ్యాచ్ తుది జట్టులో కీలక మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. ఇద్దరు సీనియర్లు దూరం కానున్నారు. కాగా.. డేంజరస్ ఆల్ రౌండర్ ను తుది జట్టులోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.
అహ్మదాబాద్ వేదికగా సిరీస్ డిసైడర్ మ్యాచ్ కోసం టీమిండియా సిద్దం అవుతోంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఇందు కోసం తుది జట్టు పైన రెండు టీం లు కసరత్తు చేస్తున్నాయి. ఈ మ్యాచ్ కు గిల్, అక్షర్ పటేల్ దూరం అవుతున్నారు. లక్నో మ్యాచ్ లోనే గిల్ ఆడే అవకాశాలు కనిపించ లేదు.

ఇక.. చివరి టీ20 లోనూ ఆడే అవకాశం లేదని.. హెల్త్ కారణాలతోనే దూరంగా ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతని స్థానంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బెంగాల్ ఆల్ రౌండర్ షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి పిలిచారు. చివరి మ్యాచ్ డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
ఈ మ్యాచ్ కోసం అక్షర్ పటేల్ దూరం కావడంతో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్ రౌండర్ అయిన షాబాజ్ అహ్మద్‌ను గంభీర్ ఎంపిక చేశాడు. అక్షర్ లాగే షాబాజ్ కూడా బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించగల సామర్థ్యం ఉన్న ఆటగాడు కావడంతో అతనికి ఈ అవకాశం దక్కింది. షాబాజ్ అహ్మద్ గతంలో టీమిండియా తరపున మూడు వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడారు. ఈ ఐదు మ్యాచ్‌ల్లో కలిపి అతను 5 వికెట్లు పడగొట్టారు.
2023 ఆసియా క్రీడల తర్వాత అతను మళ్ళీ జాతీయ జట్టులోకీ ఈ మ్యాచ్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. డిసైడర్ మ్యాచ్ కోసం తుది జట్టులో సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్,జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో, చివరి మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ నిలబెట్టుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications