టీమిండియాలో నువ్వుంటే చాలు సామీ

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్.. పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తిలక్ వర్మ అద్భుతంగా ఆడాడు. 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. సంజు శాంసన్- 24, శివం దూబే-33 తో కలిసి భారీ ఇన్నింగ్ నిర్మించడంతో గెలుపు ఖాయమైంది. పాకిస్తాన్ జట్టు భారత్ చేతిలో ఈ టోర్నీలో ఇది మూడో ఓటమి.

శివమ్ దూబే టీ20 మ్యాచ్‌లలో భారత్‌కు కీలక ఆటగాడిగా నిలిచాడు. ఆల్ రౌండర్ గా ఎదిగాడీ టోర్నమెంట్ తో. బౌలర్లను అవలీలగా ఎదుర్కోవడమే కాకుండా.. మీడియం పేస్ బౌలింగ్‌తో వికెట్లను పడగొడుతున్నాడు. ఆల్‌రౌండర్లు అత్యవసరమైన ప్రస్తుత పరిస్థితుల్లో జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడుతున్నాాడు. ఆసియా కప్ ఫైనల్ తర్వాత అతని ప్రాధాన్యత బాగా పెరిగింది. ప్లేయింగ్ 11లో అతన్ని తీసుకోకపోతే అయిదుమంది బౌలర్లకే పరిమితం కావాల్సి ఉంటుందనేంత స్థితి తలెత్తింది.

Shivam Dube The Unbeaten Hero of Team India in T20I

టీ20 ఫార్మట్ లో ఎంతమంది ఆల్ రౌండర్లు ఉంటే అంతగా జట్టుకు ప్రయోజనం. పైగా ఫైనల్ కు హార్దిక్ పాండ్యా కూడా అందుబాటులో లేడు. ఈ నేపథ్యంలో శివందూబే ఆరో బౌలర్ గా ఆసియా కప్ ఫైనల్ ఆడిన జట్టుకు ఎంపికయ్యాడు. అటు మిడిలార్డర్ లో హిట్టర్‌గా, ఇటు డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ గా గుర్తింపును పొందాడు. ఫైనల్ లో వికెట్లు పడగొట్టనప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లల్లో 23 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్ లో సత్తా చాటాడు. 22 బంతుల్లో రెండు చొప్పున భారీ సిక్సర్లు, బుల్లెట్ల వంటి ఫోర్లతో 33 పరుగులు చేశాడు.

నిజానికి- శివం దూబే ఆడిన ఏ ఒక్క టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ను కూడా టీమిండియా ఓడిపోలేదు. 2019 డిసెంబర్ 11 నుండి అతను ఆడిన ఏ ఒక్కదాంట్లోనూ జట్టు ఓటమిని చవిచూడలేదు. ఇప్పటివరకు శివం దూబే 32 టీ20 మ్యాచ్‌లను ఆడగా.. టీమిండియా అజేయంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లలో 30 గెలిచింది. రెండు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. టై అయిన నాలుగు మ్యాచ్‌లల్లో కూడా భారతే విజయం సాధించింది.

దూబే ప్లేయింగ్ 11లో ఉన్నప్పుడు భారత్ చివరిసారిగా టీ20 మ్యాచ్‌లో ఓటమి పాలైంది 2019 డిసెంబర్ 8న తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో. ఈ ఫార్మాట్‌లో అతను చవిచూసిన రెండు ఓటములలో ఇది ఒకటి. మరొకటి 2019 నవంబర్‌లో ఢిల్లీలో బంగ్లాదేశ్‌తో టీమిండియా ఓడిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+