RCB vs GT: కొహ్లీ క్యాచే కాదు.. ముంచింది అవే-నిర్మొహమాటంగా చెప్పేసిన గిల్..!
నిన్న బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ (IPL 026) మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. సాయి సుదర్శన్ మెరుపు సెంచరీ సాయంతో 3 వికెట్లకు 205 పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్.. కీలక సమయాల్లో తప్పిదాలతో మ్యాచ్ ను చేజార్చుకుంది. ఇందులో కీలక బ్యాట్స్ మెన్ విరాట్ కొహ్లీ క్యాచ్ వదిలేయడం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఎక్కడ పోయిందో, కొహ్లీ క్యాచ్ పట్టి ఉంటే ఏమయ్యేదో గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ (Shubman Gill) వెల్లడించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో గెలిచే పరిస్దితి నుంచి చివరికి మ్యాచ్ ఎక్కడ చేజారిపోయిందో శుభ్‌మన్ గిల్ నిర్మొహమాటంగా చెప్పేశాడు. 16వ ఓవర్ నుంచి 19వ ఓవర్ వరకు తమకు కీలకంగా మారాయని, ఆ మూడు ఓవర్లలో తాము ఒక్క బౌండరీ కూడా కొట్టలేదన్నాడు. పవర్‌ప్లే ముగిసేసరికి కూడా తాము మంచి స్థితిలో ఉన్నామన్నాడు. చివరికి మంచి స్కోరే చేసినా విరాట్ కొహ్లీని డకౌట్ చేసే అవకాశం వదులుకోవడం తప్పిదంగా మారిందన్నాడు.

ఒక బ్యాట్స్‌మన్ సున్నా పరుగుల వద్ద ఉన్నప్పుడు అతని క్యాచ్ వదిలేస్తే.. అది ఫీల్డర్‌కు ఎప్పుడూ కష్టంగానే ఉంటుందని గిల్ తెలిపాడు. కానీ ఆటలోకి ఎలా తిరిగి వస్తామనేదే ముఖ్యమన్నాడు. తమకు కొన్ని మంచి అవకాశాలు వచ్చాయని, కానీ నిలకడగా సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోయామన్నాడు. అది చాలా ముఖ్యమన్నాడు. కానీ ఆర్సీబీ మధ్య ఓవర్లలో చాలా బాగా బ్యాటింగ్ చేసిందన్నాడు. దీంతో మ్యాచ్ ను ఆర్సీబీకి కోల్పోయినట్లు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ వెల్లడించాడు. గిల్ ప్రస్తావించిన క్యాచ్ మిస్ విరాట్ కోహ్లీకి పుంజుకునే అవకాశం కల్పించింది. ఆ తర్వాత కొహ్లీ 44 బంతుల్లో 81 పరుగులు చేసి గుజరాత్ కు భారీ మూల్యం చెల్లించేలా చేశాడు.












Click it and Unblock the Notifications