ఆగిపోయిన స్మృతి మంధాన పెళ్లి
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఇంట్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆమె తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ లో నేడు జరగాల్సిన వివాహం నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పటికే హల్దీ కార్యక్రమం ముగిసింది. పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను హుటాహుటిన సాంగ్లీలోని ఆసుపత్రికి తరలించారు.
పెళ్లి నిరవధికంగా వాయిదా పడిన విషయాన్ని స్మృతి మంధాన మేనేజర్ ధృవీకరించారు. ఆమె తండ్రి శ్రీనివాస్ అనారోగ్యానికి గురయ్యారని, ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని తెలిపారు. ఇంతకుమించిన ఊహాగానాలకు అవకాశం లేదని, కష్ట సమయంలో ప్రైవసీకి భంగం కలిగించేలా వ్యవహరించవద్దని తేల్చి చెప్పారు. స్మృతి మంధాన- పలష్ ముచ్ఛల్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందనేది ఇంకా వెల్లడి కాలేదు. మరో కొత్త తేదీని వెల్లడించేంత వరకు వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేశారు.

ప్రస్తుతం స్మృతి మంధాన- పలాష్ ముచ్చల్ వివాహ వేడుకలు ఆమె స్వస్థలం మహారాష్ట్రలోని సాంగ్లీలో ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజులుగా సాంగ్లీ అంతటా సందడి వాతావరణం నెలకొంది. శనివారం రాత్రి హల్దీ కార్యక్రమం సైతం ముగిసింది. 2019 నుండి ప్రేమలో ఉన్నఈ జంట.. పెళ్లి పీటలు ఎక్కడం, మూడుముళ్ల బంధంతో ఒక్కటి కావడమే ఆలస్యం అనుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. అందర్నీ దిగ్భ్రాంతిలోకి ముంచెత్తింది.
పెళ్లి వేదికలోకి అంబులెన్స్ ప్రవేశించడంతో కుటుంబంలో ఆరోగ్య సమస్యలు తలెత్తాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. అంబులెన్స్ లోపలికి వెళ్లగానే, అతిథుల్లో ఆందోళన కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అంబులెన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అత్యవసర పరిస్థితికి గల కారణాలపై ప్రశ్నలు తలెత్తాయి. తొలుత- పెళ్లికి వచ్చిన ఓ అతిథికి అనారోగ్యం అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత శ్రీనివాస్ మంధానా తండ్రి ఆరోగ్యం క్షీణించిందని తుహిర్ మిశ్రా స్పష్టం చేశారు.
దీంతో కుటుంబం మొత్తం వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. అనారోగ్యం వివరాలు వెల్లడించనప్పటికీ గుండెపోటు సంభవించినట్లు చెబుతున్నారు. ఆయనకు అత్యవసర వైద్య సహాయం అవసరమని, కుటుంబం ఆయన సంరక్షణపై దృష్టి సారించిందని తెలిపారు. పెళ్లిపై వధూవరుల కుటుంబం స్పందించింది. కుటుంబ శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వధువరుల సన్నిహితులు చెప్పారు. ప్రస్తుతానికి కొత్త తేదీని ఖరారు చేయలేదు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications