టీమిండియా నెక్ట్స్ టీ20 కెప్టెన్ అతనే ?-భారత మాజీ క్రికెటర్ జోస్యం..!
టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్ కు అందించిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ రిటైర్మెంట్ గా ఊహాగానాలు సాగుతున్నాయి. వరల్డ్ కప్ విజయం తర్వాత సూర్యను ఇదే ప్రశ్నిస్తే.. ఇప్పుడు తనకు ఎలాంటి ఇబ్బందులూ లేవన్నాడు. 2028లో జరిగే టీ20 వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయం తన లక్ష్యమన్నాడు. దీంతో భారత టీ20 జట్టు కెప్టెన్సీపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పడినట్లే అని అంతా భావించారు. కానీ భారత మాజీ క్రికెటర్ ఒకరు మళ్లీ టీ20 కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
టీ20 వరల్డ్ కప్ ను భారత్ కు అందించడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ (Sanju Samson) తదుపరి భారత కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ తెలిపాడు. ముఖ్యంగా క్వార్టర్ ఫైనల్ లాంటి సూపర్ 8 విండీస్ మ్యాచ్, అనంతరం సెమీ పైనల్, ఆ తర్వాత పైనల్లో భారత జట్టును తన బ్యాటింగ్ తో దూకుడుగా నిలిచేలా చేసిన సంజూ శాంసన్ కు తదుపరి కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని కైఫ్ జోస్యం చెప్పాడు.

తదుపరి కెప్టెన్ ఎవరు అవుతారో ఇప్పుడే చెప్పడం కష్టమని, కానీ శాంసన్ ఆ కెప్టెన్ అయి ఉండవచ్చని కైఫ్ తెలిపాడు. తను ఉద్దేశ్యంలో అతను ఎందుకు కాదని ప్రశ్నించాడు. కెప్టెన్ ప్రపంచాన్ని చూసిన వ్యక్తి అయి ఉండాలని, బౌలింగ్ మార్పులను అమలు చేయడం, పరిపూర్ణ ఎలెవన్ ను ఆడించడం, అభిషేక్ శర్మ,వరుణ్ చక్రవర్తి లాగా ఫామ్‌లో లేని ఆటగాళ్లను బ్యాకింగ్ చేయడం వంటి అంశాలు కెప్టెన్‌కు తెలుసన్నాడు. వారు స్వయంగా దీనిని ఎదుర్కొన్నారన్నాడు. వారు ఈ చిన్న విషయాలను అర్థం చేసుకుంటారని తాజాగా కైఫ్ రవిష్ బిష్ట్‌తో చేసిన ఓ వీడియోలో వ్యాఖ్యానించాడు.

కాబట్టి శాంసన్ ఖచ్చితంగా కెప్టెన్సీ అభ్యర్థి కావచ్చన్నాడు. అయితే సూర్య బాగా ఆడుతూ ఉంటే, అతను ఆ స్థానంలో ఎక్కువ కాలం కొనసాగుతాడన్నారు. ఫిట్‌గా ఉంటే 38-39 ఏళ్ల వరకు ఆడవచ్చని, ఎలాంటి సమస్య లేదని తెలిపాడు. అలాగే పొట్టి ఫార్మాట్‌లో మరింత అనుభవం అవసరమని, కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి ఎప్పటికీ విలువైనవాడని తెలిపాడు. సూర్య రిటైర్మెంట్ చేయాలని నిర్ణయించుకుంటే, సంజు ఆ స్థానాన్ని భర్తీ చేయగలడన్నాడు. అతను ఇప్పటికే ఐపీఎల్ కెప్టెన్‌గా రాజస్థాన్ రాయల్స్‌ను ఫైనల్‌కు (2022) తీసుకెళ్లాడని, అతని వయసు కేవలం 31 సంవత్సరాలని, అందుకే తదుపరి భారత కెప్టెన్ కావచ్చని కైఫ్ వెల్లడించాడు.












Click it and Unblock the Notifications