78 వేల సంవత్సరాలైనా ఇంచు భూమిని కూడా లాక్కోలేరు.. పాక్‌కు గావస్కర్ హెచ్చరిక!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ అమానవీయ ఘటనపై అన్ని కోణాల్లో స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఉగ్రవాదులకు తగిన మూల్యం చెల్లించక తప్పదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రక్షణ బలగాలు ఇప్పటికే కూంబింగ్ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం వెల్లువెత్తుతోంది. రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, కళాకారులు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు బాధితుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ అనంతరం కామెంటరీ ప్యానెల్‌లో ఉన్న గావస్కర్, పహల్గాం ఘటనపై తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడారు. "ఈ ఘటనలు కేవలం బాధితుల కుటుంబాలకే కాదు, దేశంలోని ప్రతి భారతీయుడి గుండెను పీల్చేస్తున్నాయన్నారు. పర్యాటకులపై దాడి చేయడం కేవలం పిరికిపనేగా కాదు, మానవత్వాన్ని తాకట్టు పెట్టడమే," అని ఆయన అన్నారు.

sunil-gavaskar-slams-terrorism-after-pahalgam-attack-what-have-you-achieved-in-78-years

"78 ఏళ్లలో ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయారు"
ప్రపంచం మొత్తం శాంతికోసం కోరుకుంటున్న సమయంలో, కొందరు ఇలాంటి మార్గాన్ని ఎంచుకోవడం అనాగరికం అని గావస్కర్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులను, వారికి మద్దతుదారులకు ప్రశ్నలు సంధించారు ''ఇలాంటి చర్యల వల్ల మీకు ఏమి లాభమవుతోంది? గత 78 ఏళ్లుగా మీరు ఒక్క మిల్లీమీటర్ భూమినైనా కదిలించగలిగారా? మీరు చేస్తున్నది మానవత్వాన్ని తుంచే చర్య మాత్రమే. మరి ప్రశాంతంగా, సఖ్యంగా ఉండే మార్గాన్ని ఎందుకు ఎంపిక చేసుకోలేకపోతున్నారు?'' అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశం ముందుకు సాగుతుంది - గావస్కర్ పిలుపు
''గత 78 ఏళ్లలో సాధించలేదంటే, వచ్చే 78 వేల సంవత్సరాలకైనా సాధ్యం కాదన్నారు. శాంతిని పక్కనబెట్టి మానవులపై దాడులు చేస్తుంటే, అది మిమ్మల్ని మరింత వెనక్కి నెట్టి పెడుతుంది మాత్రమే,'' అని గావస్కర్ అన్నారు. ఇటువంటి సందర్భాల్లో మనమంతా ఒకటిగా ఉండాలని, దేశం పట్ల గౌరవం, బాధ్యతను ముందుంచాలని ఆయన పిలుపునిచ్చారు. ''భారతదేశం మరింత దృఢంగా ముందుకు సాగుతోంది. అలాంటి దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు ఎప్పటికీ విఫలమే,'' అని గావస్కర్ గట్టి సందేశం ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+