Ind Vs NZ: ఒక్క సెమీస్ గెలవని భారత్ - వాంఖడే రికార్డు తో టెన్షన్..!!
కోట్లాడి క్రికెట్ ఫ్యాన్స్ ప్రపంచ కప్ సెమీస్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సొంత గడ్డపైన భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలవాలంటే ఈ నెల 15న న్యూజీలాండ్ తో జరిగే సెమీస్ లో గెలవాలి. దీని కోసం ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న రోహిత్ సేన సెమీస్ లో కివీస్ పైన విజయం సాధిస్తుందనే విశ్వాసం కనిపిస్తోంది. ఇదే సమయంలో సెమీస్ జరిగే వాంఖడే స్టేడియం రికార్డు మాత్రం భిన్నంగా ఉంది. అదే సమయంలో 2011 ప్రపంచ కప్ అందించిన గ్రౌండ్ కూడా ఇదే.
ఇండియా వర్సస్ కివీస్ : ప్రపంచ కప్ లో అసలైన సమరం మొదలైంది. తొలి సెమీస్ లో భారత్ - న్యూజీలాండ్ జట్లు ఈ నెల 15న ముంబాయి వేదికగా తల పడనున్నాయి. లీగ్ దశలో న్యూజీలాండ్ పైన భారత్ విజయం సాధించింది. ఈ టోర్నీలో రోహిత్ టీం ఒక్క మ్యాచ్ లోనూ ఓడలేదు. ఇక రెండో రెండో సెమీ ఫైనల్ నవంబర్ 15న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. సెమీస్ లోనూ టీమిండియా ఇదే సామర్ధ్యంతో దూసుకెళ్లి ఫైనల్స్ చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. కానీ, ఇదే సమయంలో సెమీస్ జరిగే వాంఖడే స్టేడియంలో ఇండియా ఆడిన సెమీస్ లో ఏ మ్యాచ్ లోనూ విజయం సాధించలేదు. ఇప్పుడు ఈ ట్రాక్ రికార్డు ఇండియా ఫ్యాన్స్ లో కొంత ఆందోళన కలిగిస్తోంది.

వాంఖడే రికార్డు ఇలా : 1983లో వెస్టిండీస్‌ను ఓడించి టీమిండియా తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 1987లో ఇండియాలో ప్రపంచ కప్ జరిగింది. ఆ టోర్నలో వాంఖడే వేదికగా జరిగిన ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 35 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి ఫైనల్ టిక్కెట్‌ను దక్కించుకుంది. రెండు సంవత్సరాల తరువాత, నెహ్రూ కప్ సెమీ-ఫైనల్ అదే వాంఖడేలో భారతదేశం వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. ఆ తర్వాత 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో వెస్టిండీస్ మళ్లీ భారత్‌ను ఓడించింది. అదే విధంగా.. 1985లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారిగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడి ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది.
ఈ సారి భారీ అంచనాలతో : ఇదే వాంఖడేలో భారత్ సెమీస్ ఓటమి రికార్డు ఇలా ఉంటే...వీటిని అధిగిమిస్తూ ఇదే గ్రౌండ్ లో 2011 ప్రపంచకప్‌లో శ్రీలంకను ఓడించిన భారత్ 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను గెలుచుకుంది. రెండో సారి విశ్వ విజేతగా నిలిచింది. 2019 ప్రపంచ కప్ లో సెమీస్ లో ఇండియా వర్సస్ న్యూజీలాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ లోనూ న్యూజీలాండ్ గెలిచి ఫైనల్ కు చేరింది. ఆ మ్యాచ్ ఓటమి ప్రతీకారం ఈ సారి ముంబాయి వేదికగా న్యూజీలాండ్ పైన భారత్ గెలిచి..ఫైనల్స్ చేరుతుందని క్రికెట్ అభిమానులు విశ్వసిస్తున్నారు. వాంఖడే రికార్డులను ఈ సారి టీమిండియా అధిగమిస్తుందని పేర్కొంటున్నారు. దీంతో..టీమిండియాకు ఏ మాత్రం తీసిపోని న్యూజీలాండ్ మధ్య సెమీస్ ఫైట్ మాత్రం ఉత్కంఠ పెంచుతోంది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications