ఐసీయూలో టీమిండియా స్టార్ క్రికెటర్.. తీవ్ర రక్తస్రావంతో అడ్మిట్!

Shreyas Iyer: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత వన్డే జట్టు వైస్-కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు సిడ్నీలో జరిగిన మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా పక్కటెముకలకు గాయం తగలడంతో ఆయనను సిడ్నీలోని ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల్లో అంతర్గత రక్తస్రావం ఉన్నట్లు గుర్తించడంతో.. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా జరిగిన వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్‌ను భారత జట్టు వైస్-కెప్టెన్‌గా నియమించారు. అయితే ఆ సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. సిడ్నీలో జరిగిన చివరి వన్డేలో శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు.

క్యాచ్ పట్టిన సమయంలోనే ప్రమాదం
సిడ్నీ వన్డే సందర్భంగా అలెక్స్ కేరీ కొట్టిన బంతిని శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా క్యాచ్ పట్టుకున్నాడు. బ్యాక్‌వర్డ్ పాయింట్ నుంచి వెనక్కి పరుగెత్తుతూ గాల్లోకి ఎగిరి క్యాచ్ తీసుకున్నాడు. అయితే,ృ ఈ ప్రక్రియలో శ్రేయస్ అదుపు తప్పి కిందపడటంతో ఆయన ఎడమ పక్కటెముకల భాగంలో గట్టిగా దెబ్బ తగిలింది. ఫీల్డింగ్ ముగించుకుని డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న తర్వాత శ్రేయస్‌కు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎక్కువ కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నివేదికలో ఇంటర్నల్ బ్లీడింగ్ ఉన్నట్లు తేలడంతో తక్షణమే ఆయనను ఐసీయూలో చేర్చారు.

Team India Star Shreyas Iyer Admitted to ICU After Internal Bleeding During Sydney ODI

2 నుంచి 7 రోజుల పాటు పర్యవేక్షణ
ఈ పరిణామాల గురించి తెలిసిన ఓ వర్గం అందించిన సమాచారం ప్రకారం.."శ్రేయస్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే దాని ఆధారంగా, ఆయన్ను రెండు నుంచి ఏడు రోజుల వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. రక్తస్రావం కారణంగా ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఇలా చేయడం చాలా అవసరం" అని తెలిపారు. శ్రేయస్ అయ్యర్‌కు తీవ్ర గాయం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. శ్రేయస్ అయ్యర్ పూర్తి ఆరోగ్య నివేదిక, మైదానంలోకి తిరిగి రావడానికి పట్టే సమయం గురించి బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+