IND Vs AUS: భారత బౌలర్లకు పరీక్ష పెట్టిన లయన్, బోలాండ్..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో నాలుగో రోజు ఆట ముగిసింది. నాలుగో ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఓవర్ నైట్ స్కోర్ 358/9 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కాసేపట్లోనే అలౌట్ అయింది. నితీష్ కుమార్ రెడ్డి లయన్ బౌలింగ్ ఔటయ్యాడు. ఇండియా ఇన్నింగ్స్ లో నితీష్ కుమార్ రెడ్డి 114 పరుగులు చేయగా.. యశస్వి జైస్వాల్ 82, వాషింగ్టన్ సుందర్ 50, విరాట్ కోహ్లీ 36 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమ్మిన్స్, బోలాండ్, లయన్ మూడేసి వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ను జస్ప్రీత్ బుమ్రా దెబ్బ కొట్టాడు. 8 పరుగులు చేసిన కోన్ స్టాస్ పెవిలియన్ చేర్చాడు. ఉస్మాన్ ఖవాజాను సిరాజ్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత స్మిత్, హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ త్వరగా పెవిలియన్ చేరారు. కానీ ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ పట్టువదలకుండా ఆడాడు. ఈ క్రమంలోనే లబుషగే హాఫ్ సెంచరీ చేశాడు.

70 పరుగులు చేసిన లబుషగేను సిరాజ్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ స్టార్క్ ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేదు. అయినా కూడా కమ్మిన్స్ పట్టువదలని విక్రమార్కుడిలా ఆడాడు. 41 కమ్మిన్స్ ను రవింద్ర జడేజా బోల్తా కొట్టించాడు. అయితే నాథన్ లయన్, స్కాట్ బోలాండ్ భారత బౌలర్లకు పరీక్ష పెట్టారు. వికెట్ ఇవ్వకుండా ఆడారు. 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లయన్ డిఫెన్స్ ఆడుతూ.. లూజ్ బాల్స్ ను బౌండరీ తరలించారు.
వారిని ఔట్ చేయడానికి ఇండియా బౌలర్లు నానా కష్టాలు పడ్డారు. చివరికి కొత్త బంతి తీసుకుని బౌలింగ్ వేశారు. బుమ్రా బౌలింగ్ నాథన్ స్లిప్ లో కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసిందని అనుకుంటుండగానే అది నో బాల్ అని ఎంపైర్ ప్రకటించాడు. దీంతో లయన్ ఔట్ కాలేదు. వారిని ఔట్ చేయకుండానే నాలుగో రోజు ముగిసింది. ఆసీస్ ఇప్పటికే 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. సోమవారం మరో 20 పరుగులు చేసిన ఇండియా ముందు భారీ లక్ష్యం ఉంటుంది. ఈ పిచ్ ఇంత లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే..!
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications