Champions Trophy: ఆ ముగ్గురిపై వేటు - ఈ ఇద్దరి మధ్య పోటీ..!!
టీమిండియా ముందు భారీ పరీక్షలు ఉన్నాయి. ఇంగ్లాండ్ సిరీస్ తో పాటుగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఇప్పుడు టీమిండియా జట్టును ఎంపిక చేయటం కత్తిమీద సాముగా మారింది. దీంతో, ఎంపిక పైన సుదీర్ఘ కసరత్తు కొనసాగుతోంది. తాజాగా ఆస్ట్రేలియలో సిరీస్ ఓటమి తరువాత అభిమానుల నుంచి వస్తున్న స్పందనతో ఒత్తిడి పెరుగుతోంది. రోహిత్, కోహ్లీ కొనసాగింపు పైన అనుమానాలు లేకపోయినా.. మరో ముగ్గురు కీలక ప్లేయర్లు .. అదే విధంగా ఇంకో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉండటం తో ఎవరికి ఫైనల్ గా ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ఎంపిక పై కసరత్తు
ఇంగ్లాండ్ తో సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా కూర్పు పైన తర్జన భర్జన పడుతున్నారు. ఎవరికి అవకాశం ఇవ్వాలనే దాని పైన కసరత్తు కొనసాగుతోంది. ఆసీస్ టూర్ లో టీమిండియా సమర్ధత చూసిన తరువాత ఈ కసరత్తు మరింత కష్టంగా మారుతోంది. గాయం కారణంగా దూరం అయిన బూమ్రాకు ఇంగ్లాండ్ సిరీస్ కు రెస్టు ఇచ్చి ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్దం అయ్యేలా ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే, మహ్మద్ షమీ పునరాగమనం పైన ఇంకా స్పష్టత రాలేదు. ప్రపంచ కప్ తరువాత వన్డే మ్యాచ్ ల్లో ఇప్పటి వరకు షమీ ఆడలేదు. దీంతో, షమీ విషయం లో నిర్ణయం ఏంటనేది తేలాల్సి ఉంది.

వారిలో ఛాన్స్ ఎవరికి
అదే విధంగా జడేజా కొనసాగింపు కష్టంగానే కనిపిస్తోంది. జడేజా స్థానంలో అక్షర్ పటేల్ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. ఆసీస్ టూర్ లోనూ జడేజా పెద్దగా రాణించ లేదు. కొంత కాలంగా ఫాం లో లేని కారణంగా జడేజా ను పక్కన పెట్టటం ఖాయంగా కనిపిస్తోంది. అదే విధంగా బౌలర్ల విషయంలోనూ అన్ని కోణాల్లోనూ ఆలోచించి ఎంపిక ఉంటుందని చెబుతున్నారు. ఇటు వికెట్ కీపర్ల విషయంలోనూ తర్జన భర్జన పడుతున్నారు. పంత్ టెస్టులోనూ టీ 20 తరహాలో చెలరేగాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి కేఎల్ రాహుల్ ను కొనసాగిస్తారా లేదా అనేది ఇంకా డైలమా గానే ఉంది. పంత్ కొనసాగిస్తే కేఎల్ రాహుల్ కు ఛాన్స్ లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తుది కసరత్తు
వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఈ నెల 12వ తేదీ లోగా బీసీసీఐ జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఇంగ్లాండ్ తో టీమిండియా 5 టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. దీంతో, ఇప్పుడు ఎవరికి అవకాశం దక్కుతుంది.. ఎవరిని పక్కన పెడుతారనే అనే అంచనాలు పెరిగిపోతున్నాయి. యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా బౌలింగ్ లో ఉన్న సమస్యల కారణంగా ఈ సారి పేసర్ల విషయంలో చేసే ఎంపిక జట్టు గెలుపు కు కీలకంగా మారనుంది. దీంతో, ఒకటి రెండు రోజుల్లోనే టీమిండియా ను అధికారికంగా ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications