ట్రైనింగ్ లో 270 కిలోల రాడ్డు మీద పడి.. యువ అథ్లెట్ మృతి
ట్రైనింగ్ లో భాగంగా పవర్ లిఫ్టింగ్ చేస్తూ యువ అథ్లెట్ మృతి చెందింది. ఈ విషాద ఘటన రాజస్థాన్ లోని బికనూర్ జిల్లాలో జరిగింది. మహిళా పవర్ లిఫ్టర్ యశ్తికా ఆచార్య(17) ట్రైనింగ్ లో భాగంగా పవర్ లిఫ్టింగ్ చేస్తుండగా 270 కేజీల రాడ్డు ప్రమాదవశాత్తు ఆమె మెడ మీడ పడింది. దీంతో యశ్తికా మెడ విరిగి ఊపిరి అందక కుప్పకూలిపోయింది. వెంటనే జిమ్ సిబ్బంది ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఈ ఘటనలో ట్రైనర్ కు కూడా స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఆమె ట్రైనింగ్ లో కుప్పకూలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని బికనూర్ స్టేషన్ హెడ్ ఆఫీసర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం తర్వాత కుటుంబసభ్యులకు అందించినట్లు తెలిపారు. యశ్తికా పవర్ లిఫ్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటోంది. ఇప్పటికే ఆమె జూనియర్ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ లో అనేక పతకాలు సాధించినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.
खौफनाक VIDEO..
— NDTV India (@ndtvindia) February 19, 2025
बीकानेर में 17 वर्षीय वेटलिफ्टर यष्टिका आचार्य की मौत, ट्रेनिंग के दौरान उठा रही थी 270 किलो वजन#Bikaner । #Rajasthan pic.twitter.com/2L9UAb1Jeu
ఇక ట్రైనింగ్, ప్రాక్టీస్ సమయాల్లో ఆటగాళ్లు మృతి చెందడం అరుదుగా జరుగుతుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. 2014లో ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ ప్లేయర్ బంతి తగిలి మైదానంలోనే కుప్పకూలి మృతిచెందాడు. ఈ ఘటన అప్పుడు సంచలనంగా మారింది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!












Click it and Unblock the Notifications