బ్రేకులు ఫెయిలైన రైలులా...టీమిండియా వరల్డ్ కప్ జైత్రయాత్రపై వసీం అక్రమ్ కామెంట్..
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఆతిధ్య భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ లు ఆడిన టీమిండియా.. ఐదింటిలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. అందులోనూ ఈ ప్రపంచకప్ లో మేటి జట్లయిన ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, పాకిస్తాన్ ను ఓడించడంతో రోహిత్ సేనపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ క్రికెట్లో దిగ్గజాలంతా ఇప్పుడు భారత్ ను ఆకాశానికెత్తేస్తున్నారు.
ఇదే క్రమంలో తాజాగా న్యూజీలాండ్ పై భారత్ సాధించిన అద్భుత విజయంపై స్పందిస్తూ పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రం కూడా రోహిత్ సేనపై ప్రసంశల జల్లు కురిపించాడు. వసీం అక్రమ్ ఈసారి భారత జట్టును ఏకంగా బ్రేకుల్లేని రైలుతో పోల్చాడు. బ్రేకులు ఫెయిలైతే దూసుకుపోతున్న రైలులా భారత జట్టు జైత్రయాత్ర ఉందని న్యూస్ ఛానల్ ఏ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీం అక్రమ్ పోల్చాడు. తద్వారా భారత్ కు ఎదురేలేదనేలా వ్యాఖ్యలు చేశాడు.

ఓవైపు మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీయడం, మరోవైపు ఛేజింగ్ లో కింగ్ విరాట్ కొహ్లీ 95 పరుగులు చేయడంతో భారత్ నాలుగి వికెట్ల తేడాతో పటిష్టమైన న్యూజీలాండ్ ను మట్టికరిపించింది. తుది కంటా ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ ను భారత్ అలవోకగానే గెల్చుకుంది. ఈ మ్యాచ్ ను లైవ్ స్ట్రీమ్ లో ప్రత్యక్షప్రసారం ద్వారా చూసిన అభిమానుల సంఖ్య దాదాపు 4 కోట్లు దాటిపోయిందంటే మ్యాచ్ ఏ స్ధాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు.
దీనిపై స్పందించిన వసీం అక్రం.. భారత్ ప్రస్తుతం బ్రేకులు ఫెయిలై దూసుకుపోతున్న రైలులా ఉందన్నాడు. ఆ జట్టు ఆట తీరు అలా ఉందన్నాడు. వాళ్ల దగ్గర ఆయుధాలు(మెరికల్లాంటి ఆటగాళ్లు), ప్రతిభ, నైపుణ్యం ఉందన్నాడు. అన్నింటికంటే మించి తమ వ్యూహాల్ని ఎలా అమలు చేయాలో భారత జట్టుకు తెలుసంటూ వసీం అక్రం వ్యాఖానించాడు.












Click it and Unblock the Notifications