Paris olympics 2024: వినేష్ ఫోగట్‌కు బిగ్ షాక్..ఒలింపిక్స్ నుంచి ఔట్..!!
Vinesh Phogat:వినేష్ ఫోగట్ ప్రస్తుతం యావత్ క్రీడాలోకం జపిస్తున్న పేరు. నిన్న 50 కేజీల విభాగంలో సెమీస్‌లో పాల్గొన్న ఈ రెజ్లర్ ఆనందం 24 గంటల్లోనే ఆవిరైంది. బరువు ఎక్కువగా ఉన్న కారణంగా ఆమెను డిస్‌క్వాలిఫై అయినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
మంగళవారం మహిళల 50 కిలోల విభాగంలో జరిగిన సెమీ ఫైనల్స్ రెజ్లింగ్‌లో క్యూబా మహిళా రెజ్లర్ యుస్‌నేలిస్ గుజ్‌మాన్ పై విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.వినేష్ పోగట్ ఉండాల్సిన బరువుకంటే 100 గ్రాములు అధికంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది.ఇది చాలా దురదృష్టకరమని చెప్పిన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ దీనిపై ఇంకా లోతుగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడుతామని స్పష్టం చేసింది. ఈ కష్ట సమయంలో వినేష్ ఫోగట్‌కు అండగా ఉండాలని ఆమెకు ప్రైవసీని కల్పించాలని సూచించింది.

వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు#VineshPhogat #wrestling #Paris2024 #ParisOlympics2024 #OlympicGames #Olympics #Oneindiatelugu pic.twitter.com/MSrRsNLRyL
— oneindiatelugu (@oneindiatelugu) August 7, 2024
అంతకుముందు వినేష్ ఉండాల్సిన బరువుకంటే కేవలం 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.ఇక కాంపిటీషన్ నిబంధనల ప్రకారం ఫోగట్ 50 కేజీల విభాగంలో వెండి పతకానికి కూడా అర్హురాలు కాదని తెలుస్తోంది. దీంతో 50 కేజీల మహిళా రెజ్లింగ్ విభాగంలో పోటీ కేవలం పసిడి, కాంస్య పతకం కోసమే జరుగుతుందని సమాచారం. పోటీ జరిగే రెండ్రోజుల పాటు రెజ్లర్లు వారికి సంబంధించిన బరువు కేటగిరీకి లోపలే ఉండాలనేది నిబంధన.
ఇదిలా ఉంటే మంగళవారం రాత్రికి ఆమె 2 కిలోల పాటు అధిక బరువు ఉన్నట్లు ప్రముఖ జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.అయితే ఈ 2 కిలోల బరువును తగ్గించుకునేందుకు నిద్ర లేకుండా రాత్రి మొత్తం తన బరువును తగ్గించుకునేందుకు జాగింగ్, స్కిపింగ్ మరియు సైక్లింగ్ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆమె ఇంకా 100 గ్రాములు అధికంగా బరువు ఉన్నట్లు సమాచారం.అయితే భారత క్యాంప్ ఆ 100 గ్రాముల బరువును కోల్పోయేందుకు ఇంకొంత సమయం ఇవ్వాలని కోరినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో ఆమెపై అనర్హత వేటు ఖరారైంది.
50 కిలోల విభాగంలో ఫోగట్ పై ఇలా వేటు పడటం ఇది తొలిసారి కాదు. ఒలింపిక్ క్వాలిఫైయింగ్ రౌండ్లో కూడా తృటిలో అనర్హత వేటు నుంచి బయటపడింది. సాధారణంగా వినేష్ ఫోగట్ 53 కిలోల విభాగంలో పోటీ పడుతుంది.మంగళవారం జరిగిన సెమీస్ రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఫైనల్స్‌కు చేరే క్రమంలో వినేష్ ఫోగట్ వరల్డ్ నెంబర్ 1 మహిళా రెజర్ల్ జపాన్‌కు చెందిన యుసుసాకీ పై విజయం సాధించింది.అనంతరం, యుక్రెయిన్, క్యూబా దేశాలకు చెందిన మహిళా రెజ్లర్లపై అనూహ్య విజయం సాధించి ఫైనల్స్‌కు చేరింది.












Click it and Unblock the Notifications