INDIA vs PAK: కొహ్లీ, రాహుల్ సెంచరీల మోత-పాక్ ముందు 357 టార్గెట్ పెట్టిన భారత్..
శ్రీలంకలోని కొలంబోలో పాకిస్తాన్ తో జరుగుతున్న ఆసియాకప్ సూపర్ 4 మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్ జూలు విదిల్చారు. నిన్న ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ అర్దసెంచరీలతో తొలివికెట్ కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే.. ఇవాళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్ శతకాలతో రెచ్చిపోయారు. దీంతో పాకిస్తాన్ ముందు ఏకంగా 357 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఉంచింది.
2 వికెట్లకు 147 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. పాకిస్తాన్ పేసర్లను ఆరంభంలో ఆచితూచి ఆడినట్లు కనిపించిన వీరిద్దరూ అనంతరం ఎవరినీ వదిలిపెట్టలేదు. మైదానం నలుమూలలా బౌండరీలు, సిక్సర్ల మోత మోగించారు. దీంతో భారత్ మూడో వికెట్ కు 233 పరుగుల అభేద్యమైన భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్ వరుస బౌండరీలు, సిక్సర్లతో రెచ్చిపోతుంటే పాకిస్తాన్ బౌలర్లు, ఫీల్డర్లు చేష్టలుడిగి చూడాల్సి వచ్చింది. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఎందరు బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఫలితం లేకపోయింది. ముఖ్యంగా భారత్ పై మంచి రికార్డు ఉన్న పాకిస్తాన్ పేసర్లు అఫ్రిది, రవూఫ్, నసీమ్ షా ఈ మ్యాచ్ లో తేలిపోయారు. స్పిన్నర్లు షాదాబ్, ఇఫ్తికార్ ఎత్తులూ పారలేదు. దీంతో ముందు కేఎల్ రాహుల్, ఆ తర్వాత విరాట్ కొహ్లీ సెంచరీలు పూర్తి చేసేశారు.
కేఎల్ రాహుల్ 2 సిక్సర్లు, 10 ఫోర్ల సాయంతో 100 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. అనంతరం విరాట్ కొహ్లీ 2 సిక్సర్లు 6 ఫోర్ల సాయంతో 84 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం కూడా వీరిద్దరి జోరు సాగింది. దీంతో భారత్ ఇవాళ 25.4 ఓవర్లలో209 పరుగులు సాధించింది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ కెరీర్ లో ఆరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే కొహ్లీ 47వ సెంచరీ పూర్తి చేశాడు. అలాగే వేగంగా 13 వేల పరుగులు సాధించిన రికార్డు కూడా అందుకున్నాడు.
-
పాక్ పరువు గంగలో.. అప్పుల అప్పారావుకు అంతర్జాతీయ అవమానం! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!!












Click it and Unblock the Notifications