సచిన్ టెండుల్కర్ ఇంట పెళ్లి బాజా
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. తన ప్రియురాలు, వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలైన సానియా చందోక్‌తో మార్చి 5వ తేదీన పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 3వ తేదీ నుంచి ముంబైలో హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని టెండుల్కర్, రవి ఘాయ్ కుటుంబాలకు చెందిన వాళ్లు ఎవరూ ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు గానీ.. జాతీయ మీడియాలో దీనిపై విస్తారంగా కథనాలు వెల్లువెత్తుతున్నాయి.
గత ఏడాది ఆగస్టులో అర్జున్ టెండుల్కర్, సానియా చందక్ నిశ్చితార్థం సీక్రెట్‌గా జరిగిన సంగతి తెలిసిందే. సారా టెండూల్కర్‌కు సానియా చందోక్ క్లోజ్ ఫ్రెండ్. సారా ద్వారానే ఆమె అర్జున్‌కు పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత ఏడాది ఆగస్టులో ముంబైలో కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య ఈ ఎంగేజ్మెంట్ జరిగింది. సానియా చందోక్.. ముంబైకి చెందిన వ్యాపారి రవి ఘాయ్ మనవరాలు. ఆమె కుటుంబం.. హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ రంగంలో కొనసాగుతోంది.

ఘాయ్ కుటుంబానికి చెందిన గ్రావిస్ ఫుడ్ సొల్యూషన్స్ గ్రూప్ 'ది బ్రూక్లిన్ క్రీమెరీ' వాళ్లకు చెందినదే. బాస్కిన్ రాబిన్స్ ఇండియా కార్యకలాపాలను కూడా ఘాయ కుటుంబమే నిర్వహిస్తోంది. ముంబైలోని ప్రముఖ ఇంటర్ కాంటినెంటల్ హోటల్ కూడా ఈ గ్రూప్ లోనిదే. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్రూక్లిన్ క్రీమెరీ మాతృ సంస్థ గ్రావిస్ ఫుడ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 624 కోట్ల రూపాయల నికర ఆదాయాన్ని ఆర్జించిందంటే అది ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ గ్రూప్ కు చెందిన 'మిస్టర్ పాస్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్ఎల్పీ'కి సానియా చందోక్ డిజిగ్నేటెడ్ పార్టనర్ కమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తోన్నారు. 2022లో దీన్ని ఆమె ప్రారంభించారు. 25 ఏళ్ల ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్జున్ టెండుల్కర్. దేశీయ క్రికెట్‌లో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. గోవా తరఫున ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ మ్యాచ్ లు ఆడాడు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications