Rohit Sharma : రోహిత్ కెప్టెన్సీ తొలగింపు వెనుక ఆయనే ? బయటపెట్టిన మాజీ.. !
గతేడాది భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ(rohit sharma)ను సెలెక్టర్లు అనూహ్యంగా తప్పించారు. రోహిత్ శర్మ స్ధానంలో శుభ్ మన్ గిల్ ను వన్డే జట్టు కెప్టెన్ గా నియమించారు. 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు. అయితే అంతకు మించి రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించాలన్న నిర్ణయం వెనుక ఎవరున్నారనే అంశాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ ఒకరు బయటపెట్టారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెల్చుకున్నతర్వాత రోహిత్ శర్మ ఊహించని విధంగా కెప్టెన్సీ కోల్పోయాడు. ఇందుకు 2027 వరల్డ్ కప్ అవసరాల్ని బీసీసీఐ, సెలెక్టర్లు కారణంగా చూపినా.. రోహిత్ శర్మను తప్పించడంపై ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇదో అనవసర నిర్ణయమని, చాలా కఠినమైనదని విమర్శించారు. అయితే ఈ నిర్ణయాన్ని సెలక్షన్ కమిటీ చీఫ్ గా అజిత్ అగార్కర్ అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఈ నిర్ణయంలో టీమ్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ (gautam gambhir) ముఖ్యమైన పాత్ర పోషించారని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ (Manoj Tiwary) అభిప్రాయపడ్డాడు.

అయితే రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం వెనుక ప్రధాన కారణం ఏంటో తనకూ తెలియదని స్పోర్ట్స్ టుడేతో మాట్లాడుతూ మనోజ్ తివారీ పేర్కొన్నాడు. ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్(ajit agarkar)కు బలమైన వ్యక్తిత్వం ఉందని, అతను కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడని నిర్ణయాత్మక నాయకుడని తివారీ తెలిపాడు. అయితే అతను తన భుజం నుండి తుపాకీని పేల్చడానికి వేరొకరిచే ప్రభావితమయ్యాడా అని అనుమానం వ్యక్తం చేశాడు. ఒకటి ప్లస్ వన్ రెండుకు సమానం అయ్యేలా తెరవెనుక చాలా జరుగుతుందన్నాడు. కోచ్ ఇన్ పుట్ లేకుండా ఛీఫ్ సెలెక్టర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేడన్నాడు.

అలాగే ప్రస్తుత జట్టు ఎంపికలపైనా మనోజ్ తివారీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్లేయింగ్ XIని ఎంచుకోవడంలో చాలా అస్థిరతలు ఉన్నాయని, వన్డే మ్యాచ్‌లను చూడటంలో తనకు ఆసక్తి తగ్గిందని కూడా వెల్లడించాు. టీ20 ప్రపంచ కప్ విజేత, ఛాంపియన్స్ ట్రోఫీ విజేత కెప్టెన్‌ను తొలగించి, అతని స్థానంలో కొత్త వ్యక్తిని నియమించడం అనవసరంగా అనిపిస్తుందన్నాడు. రోహిత్‌తో ఆడిన తనకు అతనితో అనుబంధం ఉందని, ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు ఓ క్రికెటర్‌కు అగౌరవంగా అనిపించిందన్నాడు.












Click it and Unblock the Notifications