లెఫ్ట్ హ్యాండర్స్ రూలింగ్ వరల్డ్ కప్ 2023: 4 సెంచరీలు
సిమ్లా: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అదరగొడుతోంది. ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది. భారీ స్కోరు దిశగా సాగుతోంది. ప్రత్యర్థి బంగ్లాదేశ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. మరోసారి స్కోర్ బోర్డ్ 400 పరుగులకు చేరువ కావటం ఖాయంగా కనిపిస్తోంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. ఏ మాత్రం కూడా బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. తొలి ఓవర్ నుంచి దూకుడుగా ఆడటం మొదలుపెట్టారు ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్ మలన్, జానీ బెయిర్ స్టో. ఈ క్రమంలో బెయిర్ స్టో హాఫ్ సెంచరీ సాధించాడు. మలన్ మాత్రం దాని మూడింతల పరుగులు పిండుకున్నాడు.

సునామీ ఇన్నింగ్ ఆడాడు. అలవోకగా సెంచరీ బాదాడు. 107 బంతుల్లో 140 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్‌లో 16 ఫోర్లు, అయిదు భారీ సిక్సర్లు నమోదయ్యాయి. తొలి వికెట్ భాగస్వామ్యానికి వారిద్దరూ 115 పరుగులు జోడించారు. 52 పరుగులు చేసి బెయిర్ స్టో షకిబుల్ హసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
ఫస్ట్ డౌన్‌గా అతని తరువాత వచ్చిన జో రూట్ సైతం దుమ్ము రేపాడు. 68 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 పరుగులు చేశాడు. ఈ ముగ్గురి దూకుడుతో జట్టు స్కోరు.. 41 ఓవర్లలోనే 300 మార్క్‌ను దాటుకుంది. కేప్టెన్ జోస్ బట్లర్- 20, హ్యారీ బ్రూక్- 20, లియామ్ లివింగ్ స్టోన్-0 పరుగులతో త్వరగా అవుట్ అయ్యారు గానీ అప్పటికే జట్టు స్కోర్ 300ను దాటేసింది. ఇంకా చేతిలో అయిదు ఓవర్లు ఉన్నాయి.
ఈ వరల్డ్ కప్‌లో నమోదైన నాలుగో సెంచరీ ఇది. ఇప్పటివరకు న్యూజిలాండ్‌కు చెందిన ఓపెనర్ డెవాన్ కాన్వే, టాప్ ఆర్డర్ బ్యాటర్ రచిన్ రవీంద్ర, దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికార్ సెంచరీలను బాదారు. ఇప్పుడు అదే జాబితాలో ఇంగ్లాండ్ ఓపెనర్ డేవిడ్ మలన్ చేరాడు. ఈ నలుగురు బ్యాటర్లు కూడా లెఫ్ హ్యాండర్లే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వరల్డ్ కప్‌ను శాసిస్తోన్నట్టే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications