భారత్ ఆడబోయే సెమీ ఫైనల్ వివరాలు ఇవే: ప్రత్యర్థి, స్టేడియం, తేదీ- సమయం, పిచ్ రిపోర్ట్..!!
ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 లీగ్ దశ నేటితో ముగియబోతోంది. నేడు భారత్.. తన చిట్టచివరి లీగ్ మ్యాచ్ ఆడబోతోంది. నెదర్లాండ్స్‌ను ఎదుర్కొననుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.
ఈ వరల్డ్ కప్‌లో ఇదే చిట్టచివరిది లీగ్ మ్యాచ్. దీని తరువాత సెమీ ఫైనల్స్ మొదలవుతాయి. 15, 16 తేదీల్లో రెండు సెమీ ఫైనల్స్ ముగుస్తాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు.. సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

భారత్- న్యూజిలాండ్‌తో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు.. నాలుగో పొజీషన్‌లో ఉన్న టీమ్‌తో ఆడటం ఆనవాయితీగా వస్తోంది. రెండో స్థానంలో ఉన్న జట్టు.. తన తరువాతి ప్లేస్‌లో ఉన్న టీమ్‌తో సెమీ ఫైనల్స్ ఆడాల్సి ఉంటుంది.
ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్.. వైదొలిగాయి. లీగ్ దశలోనే ఈ ఆరు జట్ల ప్రస్థానం ముగిసింది. సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడానికి అవసరమైనన్ని పాయింట్లు, నెట్ రన్‌రేట్‌ను సాధించలేకపోయాయి.. ఈ ఆరు జట్లు కూడా. ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక.. గతంలో వరల్డ్ కప్ ఛాంపియన్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

గ్రూప్ దశలో సెమీ ఫైనల్స్ చేరిన నాలుగో జట్టు న్యూజిలాండ్. బెంగళూరులో శ్రీలంకను అయిదు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లల్లో 171 పరుగులకు ఆలౌట్ కాగా.. ఈ లక్ష్యాన్ని 23.2 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి ఛేదించారు బ్లాక్ క్యాప్స్.
తొలి సెమీస్‌లో భారత్‌తో తలపడే జట్టు న్యూజిలాండే. ఈ నెల 15వ తేదీన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ పోరు ఆరంభమౌతుంది. గెలిచిన జట్టు 19వ తేదీన ఫైనల్స్ ఆడుతుంది. 16వ తేదీన దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్స్ విజేతతో తలపడుతుంది.

వాంఖెడే.. భారత్‌కు బాగా అచ్చొచ్చిన స్టేడియంగా భావిస్తారు. ఇది బ్యాటింగ్ పిచ్. బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందిక్కడి పిచ్. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగే అవకాశం ఉంది. లీగ్స్‌లో శ్రీలంకతో మ్యాచ్ కూడా ఆడింది ఇదే స్టేడియంలో. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంకను 19.5 ఓవర్లల్లో 55 పరుగులకే కుప్పకూల్చింది.
ఈ సారి సెమీస్ ప్రత్యర్థి న్యూజిలాండ్ కావడం.. గెలుపు అంత సులువుగా ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్స్ వరల్డ్ కప్ టోర్నమెంట్ నాకౌట్స్‌లల్లో భారత్‌పై వరుసగా గెలుస్తూ వస్తోంది కివీస్. 2016 నుంచి ఐసీసీ నాకౌట్స్‌లల్లో న్యూజిలాండ్ చేతుల్లో భారత్ ఓడిపోతూనే ఉంది. 2016 నుంచి వరుసగా అయిదుసార్లు న్యూజిలాండ్‌తో తలపడగా అన్నింట్లో పరాజయమే పలకరించింది.
2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో ఇదే న్యూజిలాండ్ చేతిలో ఓడింది భారత్. 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లోనూ విజయం ఆ జట్టునే వరించింది. అదే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో కూడా కివీస్ చేతిలో ఓడింది భారత్. ఇప్పుడదే సీన్ రిపీట్ అవ్వొచ్చనే ఆందోళన అభిమానుల్లో నెలకొని ఉంది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications