నేటితో వంద కోట్ల భారతం
న్యూఢిల్లీ ః భారతదేశ జనాభా 11-5-2000, గురువారం మధ్యాహ్నం 12.56 గంటలకు వంద కోట్లకు చేరుకుంటుంది. వేదభూమిఅయిన భారత జనాభా వంద కోట్లు కుచేరిందనే ఆనందం....మితి మీరిన జనాభాతో భరతమాత చిక్కిశల్యమౌతుందనే వేదన కలగలిసిన మిశ్రమ అనుభూతుల ఘట్టంఇది. 1952లో కేవలం 32 కోట్లు వున్న జనాభా 50ఏళ్ళకే అసాధారణ వేగంతో మూడింతలు పెరిగివెయ్యి కోట్ల కు చేరింది. ప్రణాళికా సంఘం అంచనాలమేరకు దేశ జనాభా సాలీనా 1.5 కోట్ల మొత్తంలో పెరుగుతున్నది. ఈ రీతిలో జనాభా పెరుగుతూ పోతే 2045నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా గలదేశంగా వున్న చైనాను భారత దేశంఅధిగమిస్తుంది.
1971,81 సంవత్సరాలలలోదేశ జనాభా పెరుగుదల రేటు 2.22 శాతంవుండగా ప్రస్తుతం అది కొంత మేరకు తగ్గి 1.91 శాతానికిచేరింది. చైనాతో పోలిస్తే ఈ పెరుగుదల రేటురెట్టింపుకంటే అధికమే. ఈ శతాబ్ది కాలంలో ప్రపంచ జనాభా మూడింతలుఅంటే 200 కోట్ల నుంచి 600 కోట్లకు పెరిగింది. అయితే భారత జనాభాఐదింతలు పెరిగిందని ప్రభుత్వం తాజా నివేదికలుపేర్కొన్నాయి. కుటుంబ నియంత్రణ పధకాలనుప్రభుత్వమే స్వయంగా ప్రవేశ పెట్టిన మొట్టమొదటిదేశం భారత దేశమే. అయినా జనాభా మాత్రంఅడ్డుఅదుపూ లేకుండా పెరిగిపతున్నది. ఇందుకు కారణం ఏమిటి?పొరపాటు ఎక్కడజరిగింది?
1977లో ఎమర్జెన్సీకాలంలో ప్రభుత్వం బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లుచేయించింది. అసలే పుత్రులు లేనిదే పున్నామనరకం తప్పదని విశ్వసించే భారతీయులకు ఈ బలవంతపు ఆపరేషన్లపర్వం ప్రజలలో వ్యతిరేక భావాన్ని పెంచింది.దేశంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపధకం సత్ఫలితాలు సాధించక పోవడానికిఇది ప్రధాన కారణమని జనాభా విషయాల నిపుణుడుఅశిష్ బోస్ అభిప్రాయపడ్డారు. 70వ దశకంలో జరిగిన పొరపాటువల్ల కుటుంబ నియంత్రణ అంటేనే ప్రజలు మండిపడేవిధంగా చేసింది. రెండు దశాబ్దాలుగా ఈ పధకం చతికిలబడిపోయిందని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్‌కార్యదర్శి మీనాక్షి దత్తా ఘోష్ అన్నారు.
గత అనుభవం నుంచిమనం పాఠాలు నేర్చుకోవాలి.... భవిష్యత్తు గురించి నిర్మాణాత్మకంగాఆలోచించేందుకు ఇది సరైన సమయం అంటూ జనాభాఫౌండేషన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్‌కె.శ్రీనివాసన్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒకభారతీయునికీ శిరోధార్యాలు.












Click it and Unblock the Notifications
