వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగార్జున ఎల్లకాలంనటుడిగానే ఉండాలని అనుకోవడం లేదు. సినిమాడైరెక్ట్‌ చేసినా ఆశ్చర్యం లేదు...ఎప్పుడు, ఏమిటి లాంటివివరాలు మాత్రం ఆయన్నే అడగండి.. అని ఆమె చెపుతుంటే,మైండింగ్‌ వన్స్‌ ఓన్‌ బిజినెస్‌ తత్వం కళ్ళముందు ప్రత్యక్షమైనట్టుగా అనిపిస్తుంది. గ్లామర్‌ ప్రపంచానికిచెందిన మనిషిలో ఉండే తళుకుబెళుకులు పట్టని ఈమాజీనటి ప్రస్తుతం బ్లూక్రాస్‌ అమలగా వార్తల్లోకి తరచూ ఎక్కుతుంటారు. క్లుప్తంగాచెప్పాలంటే ఆంధ్రా మేనకాగాంధీగాచెప్పుకోవచ్చు. శాస్త్రీయనృత్య కళాకారిణిగా,నటిగా, జంతుసంరక్షణ కార్యకర్తగా ...ఇలా బహుముఖరంగాలలో పరిచయం ఉన్న అమలతో ఇండియాఇన్ఫో ప్రతినిధి ఎస్‌.హిమబిందు ఇంటర్వ్యూ...

By Staff
|
Google Oneindia TeluguNews

జీవితం ఒకేలా సాగుతుంటే నిస్తేజంగాఅనిపిస్తుంది. మార్పులు సహజం. అవసరం కూడాను.మద్రాసు కళాక్షేత్రలో నృత్యం నేర్చుకుంటున్నప్పుడు పూర్తి ఆనందాన్ని అనుభవించాను. అయితే ఆర్ధికంగా పటిష్టం కావడానికిశాస్త్రీయ నృత్యం అంత ఉపయోగపడదు. ఈ నేపథ్యంలో సినిమావైపు మొగ్గుచూపాను. ఎప్పుడైతే ఆర్ధికంగా పటిష్టంఅయ్యానో, భార్యగా, తల్లిగా జీవితం కావాలని అనిపించింది. ఈనిర్ణయాలు తీసుకునేటప్పుడు నాలో ఎటువంటి సంకోచాలులేవు. గృహిణిగా ఉంటూ, సినిమాల్లో నటించడంచాలా హెక్టిక్‌. ఎక్కడా సంతృప్తి ఉండదు. కనుక సినిమాలకుఫుల్‌స్టాప్‌ పెట్టేశాను. అలాగని పొద్దస్తమానం ఖాళీగా గడపడం కూడాకష్టమే. నాకంటూ ఏదో ఒక మానసిక సంతృప్తిఉండటం అవసరం అనిపించి జంతుసంరక్షణ వైపుదృష్టి మరల్చాను. ఊహ తెలిసినప్పటినుంచీ జంతువులంటే చాలా ఇష్టం నాకు. ఒక రకంగాచెప్పాలంటే ఇదే నా లాంగ్‌ స్టాండింగ్‌ ఇంట్రస్ట్‌.

బ్లూక్రాస్‌ కార్యకలాపాలు ఏమిటి ?

ఈ సంస్థను స్థాపించాలని నేను మొదట్లోఅనుకోలేదు. జంతువుల పట్ల నాకున్నప్రేమ, ఆసక్తితో చిన్నగా మొదలుపెట్టాను. తరువాతఅనేక మంది స్నేహితులు పోగయ్యారు. ప్రస్తుతం 750మంది సభ్యులు బ్లూక్రాస్‌లో ఉన్నారు. జంతుసంరక్షణకుసంబంధించి ఒక శిక్షణా కార్యక్రమాన్ని మేం నిర్వహిస్తున్నాం.నాలుగు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలోని ప్రతిబ్యాచ్‌లో 20 మందిని తీసుకుంటున్నాం. అలాగే కుక్కలకురెబీస్‌ రాకుండా వాక్సినేషన్‌ చేయడం, పనిచేసే జంతువులకు విశ్రాంతి కల్పించడంవంటి కార్యక్రమాలు కొన్ని ఏర్పాటు చేస్తున్నాం.మా దగ్గర శిక్షణ పొందే వారికి, మరో సంస్థ ఎలామొదలుపెట్టవచ్చో చెపుతాం, అలాగే నిధులుసమకూర్చుకునేందుకు వీలయ్యే మార్గాలు, సంస్థలవివరాలను కూడా అందిస్తాం. మొబైల్‌ సర్వీస్‌ కూడామాకు ఉంది.

బ్లూక్రాస్‌నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ?

యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా, సాంఘిక సంక్షేమమంత్రిత్వశాఖ (జంతుసంరక్షణ విభాగం), మరికొన్నివిదేశీ సంస్థల నుంచి మాకు నిధులు సమకూరుతున్నాయి.

స్వచ్ఛందసంస్థలలో అనేకం అవినీతికిపాల్పడుతున్నాయి...మీరేమంటారు ?

స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలనుచెక్‌ చేయవలసిందిగా అప్పుడప్పుడూకేంద్ర ప్రభుత్వ శాఖలు ఆదేశిస్తుంటాయి. కానీ తనిఖీకి వెళ్లినపుడు 80శాతం సంస్థలు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి అని తేలుతోంది. కొన్ని సంస్థలుఅదృశ్యంగా ఉంటే మరికొన్ని ఆచూకీ ఉన్నా...రెడీమేడ్‌సెట్టింగ్‌లు మాత్రమే అని తేలుతుంటుంది. ఇక బ్లూక్రాస్‌ విషయానికి వచ్చే సరికి ప్రతి మూడునెలలకొక సారి మా సంస్థలో తనిఖీజరుగుతోంది. ఇన్‌కంటాక్స్‌ వాళ్లు, విదేశాల నుంచివచ్చే సొమ్మును తనిఖీ చేసే ఆర్‌.బి.ఐ వాళ్ళు,అలాగే సోషల్‌ వెల్ఫేర్‌ వాళ్లు ఎవరో ఒకరు వస్తుంటారు. ఈ తనిఖీల పట్లనేను హేపీగానే ఫీలవుతున్నాను.

పాలు జంతువులకే(మిల్క్‌ ఈజ్‌ ఫర్‌ యానిమల్స్‌) అనే ప్రకటనను మేనకాగాంధీ ఇటీవలఇచ్చారు.. మరి మీరేమంటారు?

ఈ ప్రకటన పాలకేంద్రాల నిర్వహణబ్యాక్‌డ్రాప్‌కు చెందినది. పాలు ఇచ్చినంత కాలంవాటిని ఉపయోగించుకుని, తరువాత వాటిని కసాయివాళ్ళకిఅమ్మేస్తుంటారు. ఇది ఎంత దారుణం? ఆఖరికి తిరుమల తిరుపతిదేవస్థానం వాళ్ళు కూడా వయసు మళ్ళిన ఆవుల్నివేలం వేస్తున్నారు. వాస్తవం మాట్లాడాలంటే ఈవేలంలోని ఆవుల్ని, గేదెల్ని కొనుక్కునే వాళ్ళుఎవరు? కొనుక్కున్న ఆవుల్ని, గేదెల్ని వాళ్లు ఏంచేస్తారో ఆలోచించండి... హిందువులు ఎంతో పవిత్రంగా భావించేఆలయంలోనే ఈ విధంగా జరుగుతోందంటే మిగతాచోట్ల వీటి పరిస్థితి, ముఖ్యంగా పరిశ్రమల్లో ఏవిధంగా ఉంటోందో ఊహించుకోవచ్చు. కనుకఆవులు, గేదెలువంటి జంతువులను ట్రీట్‌ చేసే విధానంలోమార్పు రావాలి. మేనక ప్రకటనను నేనుసమర్ధిస్తాను.

క్లింటన్‌హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా నగరంలో ఉన్న కుక్కలనుహింసకు గురిచేసినప్పటికీ, ముఖ్యమంత్రి కుటుంబానికిమీ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా మీరుఅసలేమీ తెలియనట్టు వ్యవహరించారనేవ్యాఖ్యలు వినిపించాయి, దీనికి మీ జవాబు ఏమిటి ?

నేనసలు పేపర్లు చదవను. అయితే స్థానికంగా ఉన్న ఆంగ్ల ప్రతిక ఈవిధంగా రాసిందని తెలిసింది. ఇటువంటి వ్యాఖ్యలన్నీరాజకీయ పూరితమైనవి. క్లింటన్‌ రాకసందర్భంగా ప్రొటోకాల్‌ ప్రకారం జాగ్రత్తలు తీసకున్నాం తప్ప కుక్కలనుచంపలేదని మునిసిపల్‌ కమీషనర్‌ తరువాత అదే పత్రికలోనేవివరణను ఇచ్చారు. అయినా ఇలా పనిగట్టుకుని గాసిప్‌లు రాసే పత్రికలనునేను పట్టించుకోను. అసలు వాళ్ల సోర్సుఏమిటో అర్ధం కాదు. ఒక వైపు చంద్రబాబు నాయుడు ఇంతచక్కగా పరిపాలిస్తుంటే, ఆయన్నివిమర్శించడమే వాళ్ళ ధ్యేయం అవుతోంది.హైదరాబాద్‌ చాలా మురికి నగరం అని మేనకాగాంధీఅన్నారని కూడా ఇదే విధంగా వక్రీకరించి రాయడంజరిగింది. నిజానికామె అలా అనలేదు.

నేషనల్‌ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ సంస్థలోప్రయోగం కోసం తెచ్చిన కోతులను విడిపించారుకదా? వాటికి ఎక్కడ పునరావాసం ఏర్పాటు చేశారు? ఇటువంటిప్రయోగాలని కొనసాగించడానికి ఎన్‌ఐఎన్‌కి అనుమతి లభించింది...ఈవిషయంలో మీ ప్రతిప్పందన ఏమిటి ?

నా అంతట నేను వెళ్లి కోతులనువిడిపించలేదు. కేంద్రానికి చెందిన సిపిసిఎస్‌ఇఎ అనే ప్రభుత్వ సంస్థమాకు ఈ ఆదేశాలు ఇచ్చింది. ప్రయోగాలుచేసేవారెవరైనా సరే ఈ సంస్థలో నమోదుచేయాలి. ఎన్‌ఐఎన్‌ ఆ విధంగా చేయకపోవడంతో,అలాగే చిన్న చిన్న పంజరాల్లో పెట్టి జంతువులనుహింసకు గురిచేయడంతో వాటిని విడిపించాల్సివచ్చింది. ఇక పునరావాసం విషయానికి వస్తే , అదిచాలా రహస్యం. కానీ ఇటువంటి జంతువులపైప్రయోగం చేసి తయారుచేసే మందులనువిదేశాల్లోని వారు వాడటం మానేస్తున్నారు. మనదేశంలో కూడా ఆ కాన్షస్‌నెస్‌ రావాల్సిన అవసరంఎంతైనా ఉంది. ఇంకా చెప్పాలంటే ఇటువంటిప్రయోగాల ద్వారా తయారుచేసిన మందులను పాశ్చాత్యులువర్ధమాన దేశాలపై రుద్దుతున్నారు.

సినిమా బ్యాగ్రౌండ్‌నుంచి వచ్చిన హీరోల భార్యలు తమ భర్తల కెరీర్‌కు ప్రాముఖ్యతనిస్తూ, సినిమాపనుల్లో సహాయపడుతున్నారు కదా. మరి నాగార్జున సినిమా కెరీర్‌విషయంలో మీ పాత్ర ఎంత ?

ఇంట్లో ఎటువంటి టెన్షన్‌ లేకుండాచూసుకోవడం మాత్రం చేస్తాను. సినిమాల మీదనాకెటువంటి ఆసక్తి లేదు. నేను కూడా సినిమాలవిషయంలో జోక్యం కల్పించుకుని, ఆయన వెంటవెళ్లాననుకోండి.....షూటింగ్‌లలో కూడా ఆయనముఖం నేను నా ముఖం ఆయన చూస్తు బోర్‌ఫీలవ్వాల్సి వస్తుంది....(నవ్వు)... కానీ ప్రస్తుతం తన పని తనది, నా ఆసక్తులునావి. ఈ రకంగా చూస్తే ఎవరి పని వారు ముగించుకునిసాయంత్రానికి ఇంటికి చేరడమే బావుంది. అయితేఆయన సినిమాలు మాత్రం నేనుచూస్తాను. బావున్నాయో లేదో చెపుతాను...సద్విమర్శ అయితేరిసీవ్‌ చేసుకుంటారు....కాకపోతే ఆ సమయంలో తమకుఎదురైన టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌ గురించి వివరిస్తారు.అయినా...ఆంతా డైరెక్టర్‌, పొడ్యూసర్‌ చేతుల్లోఉంటుంది. ఒక వేళ ఆయనే ప్రొడ్యూసర్‌ అయినాడైరెక్టర్‌ మొండి మనిషి అయితే ఏం చెయ్యలేరుకదా!

జంతువులు...వాటి సంరక్షణఅంటూ గొడవలు చేస్తుంటుందేమిటి అమల...అంటే , మనుషులకంటే జంతువులే ఈమెకుఎక్కువా?అనే కామెంట్లకు మీ జవాబు ఏమిటి ?

చాలా బాధేస్తుంది. ఇంకాచెప్పాలంటే అలాంటి వ్యాఖ్యలు చేసే వారి ఆలోచనాస్థాయి, జ్ఞానం, విజ్ఞానం పట్ల సానుభూతి కలుగుతుంది. ఇదేవ్యాఖ్యని నా దగ్గరకు వచ్చి చేసి, నేను ఇచ్చేవివరణ విన్న తరువాత అనమనండి...వారినికన్విన్స్‌ చేయగలనన్న నమ్మకం నాకుంది. అయితే ఇలా చేసే ప్రతికామెంట్‌ని, పత్రికల్లో రాసే గాసిప్స్‌ని పట్టించుకుని జవాబు చెపుతానని మాత్రంఆశించవద్దు. వాఖ్య చేసే వాళ్ళలో అంతో ఇంతోవాస్తవాన్ని ఒప్పుకునే నిజాయితీ ఉండాలి.

హోమ్‌పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X