వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎంల సదస్సు చంద్రబాబు అస్త్రం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:అమెరికా అగ్రనేత బిల్‌ క్లింటన్‌ హైదరాబాద్‌ పర్యటన కోసం గత కొద్ది వారాలుగా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తూ బిజీ బిజీ గా వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లింటన్‌ పర్యటన విజయవంతం కావడంతో పట్టలేని ఆనందంతో వున్నారు. శుక్రవారం హైటెక్‌ సిటీ లో సిఐఐ సారధ్యంలో జరిగిన సదస్సు సందర్భంగా బిల్‌ క్లింటన్‌ చంద్రబాబు ను ప్రశంసల జల్లులో ముంచేత్తారు. పాలనా వ్యవహారాలను కొత్త పుంతలు తొక్కించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని ఆయన అన్నారు. ఆమెరికా లో చంద్రబాబు పాపులర్‌ లీడరని క్లింటన్‌ అన్నప్పుడు చంద్రబాబు ఆనందంతో ముసిముసిగా నవ్వడం కనిపించింది. చంద్రబాబు లాప్‌ ట్యాప్‌ తో ఇచ్చిన ప్రజెంటేషన్‌ ను అభినందిస్తూ నేను కూడా కొన్ని స్లయిడ్స్‌ తెస్తే బావుండేదని క్లింటన్‌ అన్నారు. వంద మాటల కన్నా ఒక చిత్రం ఎంతో విషయాన్ని వివరిస్తుందని క్లింటన్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ను అధునికార్థంలోఆదర్శ రాష్ట్రంగా మలచడంలో చంద్రబాబు కృషిని ఆయన ప్రశంసించారు. పారదర్శకత, బ్యూరోక్రసి ప్రమేయం తక్కువ గా వుండి మార్కెట్‌ ఓరియెంటేషన్‌ వున్న ప్రభుత్వాలే విజయం సాధిస్తాయని క్లింటన్‌ ఆన్నారు. మైక్రో క్రెడిట్‌ పంపిణి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనతను ఆయన పొగిడారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం లో క్లింటన్‌ ను రిసీవ్‌ చేసుకున్నది మొదలు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన నగరాన్ని విడిచిపెట్టే వరకు ఆయనతోనే వున్న చంద్రబాబు క్లింటన్‌ పర్యటన పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. క్లింటన్‌ విమానం బయలు దేరిన తర్వాత విమానాశ్రయంలో సందర్శకులు, ఇతర ఆహుతులకు చిరునవ్వులతో చంద్రబాబు వి గుర్తు చూపడం కనిపించింది. క్లింటన్‌ పర్యటన పట్ల ఆయన పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్థుష్టమైన ప్రతిపాదనలు ఏమైనా వచ్చాయా అని ప్రకటిచంగా, క్లింటన్‌ పర్యటన నుంచి తక్షణ ప్రయోజనాలు తామేమీ ఆశించలేదనీ అదే విషయం పలు మార్లు స్పష్టం చేశామని ఆయన అన్నారు. క్లింటన్‌ హైదరాబాద్‌ సందర్శన వల్ల అంతర్జాతీయ చిత్రపటం పై ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక మైన గుర్తింపు లభిస్తుందని తద్వారా ఒనగూడే దీర్ఘకాలిక ప్రయోజనాలు అనేకం వున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. క్లింటన్‌ తో కొద్ది సేపు తాను ముఖాముఖి మాట్లాడానని ఈ సందర్భంగా

టెక్నాలజీ ముఖ్యంగా ఐటి రంగంలో సహకారానికి సంబంధించిన ప్రస్తావన వచ్చిందని ఆయన తెలిపారు. డ్వాక్రా గ్రూప్‌ లు ఇతర స్వయం సహాయ గ్రూప్‌ ల విషయంలో, లక్ట్రానిక్స్‌ గవర్నెన్స్‌ కోసం తాము తీసుకుంటున్న చర్యల విషయంలోనూ క్లింటన్‌ ఎంతో ముగ్ధులయ్యారని చంద్రబాబు తెలిపారు. క్లింటన్‌ చంద్రబాబు ను పొగడటంతో పాటు చంద్రబాబు కూడా క్లింటన్‌ ను ఎడాపెడా పొగడ్తలతో ముంచెత్తారు. అమెరికాను ఏడేళ్లలో అనూహ్యంగా అభివృద్ది చేసిన ఘనుడు క్లింటన్‌ అని క్లింటనే తమ ఆదర్శమని ఆయన ప్రకటించారు. క్లింటన్‌ ఇవ్వాళ్ళ అమెరికా పౌరుడు మాత్రమే కాదని విశ్వమానవుడని చంద్రబాబు పొగిడారు. ఇదిలా వుండగా క్లింటన్‌ తో చంద్రబాబు ఏకాంత సమావేశం మహావీర్‌ ఆస్పత్రిలో జరిగిందని తెలిసింది. ఈ సమావేశంలోనే చంద్రబాబు పధకాలను ఆడిగి తెలుసుకున్న క్లింటన్‌ వాటి వివరాలు తనకు ఎప్పటికప్పుడు అందజేయాల్సిందిగా కోరారని తెలిసింది. దాదాపు 10-15 నిమిషాల పాటు జరిగిన చర్చల వివరాలను వెల్లడించకుండా చంద్రబాబు క్లింటన్‌ తనను ఇ-గవర్నెన్స్‌, సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ లకు సంబంధించి ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి వివరాలు పంపమన్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంతో నిమిత్తం లేకుండా ఆలా మరో దేశాధినేతతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవచ్చా అని రాజకీయ వర్గాల్లో అప్పుడే చెవులు కొరుక్కోవడం ప్రారంభమయింది.

హోమ్‌పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X