వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌ మలిప్రేమ

By Staff
|
Google Oneindia TeluguNews

తొమ్మిది రోజుల వరుణ యజం ముగియడానికిమూడు రోజుల ముందే వాతావరణం చల్లబడిపోయిఒక్క సారిగా మేఘాలు జలజలా వర్షించాయి.సంగీతానికి ఇంత శక్తి ఉందని అనేక పౌరాణిక, చారిత్రకగాధలు చెబుతున్నా నమ్మని వారిని కూడా ఆలోచింపజేశాయిఅమృత వర్షిణి , హరిప్రియ రాగాలు.ప్రముఖ సంగీత విధ్వాంసులు నూకల చిన సత్యనారాయణ,పురాణం పురుషోత్తమ శాస్త్రి రూపకల్పన చేసినవరుణ యజం అనే సుదీర్ఘ సంగీత కార్యక్రమంఆరో రోజునే కుంభ వృష్టి కురిపించడంతోకృత్రిమ వర్షాల స్పెషలిస్టులైన శాస్త్రవేత్తలుముక్కున వేలేసుకున్నారు. మే 9 న త్యాగరాజస్వామి జయంతి సందర్భంగా తొమ్మిది రోజుల పాటుసంగీత కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని,సంగీతం వల్ల మానసికానందమే గాక సామాజికప్రయోజనం కూడా ఒనగూరాలని ప్రారంభ సభలోనూకల చిన సత్యనారాయణ అన్నారు. దేశంలోక్షామం తాండవిస్తున్న ఈ తరుణంలో మేం తలపెట్టినవరుణ యజం వల్ల వానలు కురిస్తే రాగ మహిమనుగుర్తించండి. విఫలమైతే మా స్వరార్చన లోపమనుకోండి.అని ఆయన సెలవిచ్చారు.

చరిత్రలోకి వెళ్తే 18వ శతాబ్దంలోముత్తుస్వామి దీక్షీతార్‌ అమృత వర్షిణి రాగం ఆలపించివర్షం కురిపించారంటారు. మొగలాయిల కాలంలోతాన్‌ సేన్‌ తన రాగాలాపనతో దీపాలు వెలిగించారనిప్రతీతి. నారద తుంబురులు కూడా సంగీతం ద్వారాఅద్భుతాలు చేసినట్టు పురాణగాధలున్నాయి. శిల్పారామంలోసంగీత యజం వల్ల వర్షాలు కురిశాయంటేనమ్మని నాస్తికులు కూడా కళ, కళ కోసంకాకుండా కళ సామాజిక హితం కోసం ఉపయోగపడితే అంత కంటే కావలసిందేముందనివ్యాఖ్యానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X