వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీ; కొత్తసహాస్రాబ్దిలో తొలి స్వాతంత్ర్యదినోత్సవవేడుకలు అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య జరుగతున్నాయి. గతఅర్ధశతాబ్ద స్వాతంత్ర్య భారత చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా దేశవ్యాప్తంగా విధించిన రెడ్‌ అలర్డ్‌మధ్య ఈస్వాతంత్ర్యవేడుకలు నిర్వహిస్తున్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

ఆర్థిక మంత్రి యశ్వంత్‌సిన్హా ప్రవేశపెట్టిన మిలీనియం బడ్జెట్‌, ఎన్‌ డి ఎ ప్రభుత్వ సంకీర్ణ లక్షణానికి అతిదగ్గరగా వుంది. రాజకీయంగా ఎన్‌ డి ఎలో ఎలాంటివైవిధ్యం వుందో అలాంటి వైవిధ్యాన్ని ప్రదర్శించేవిన్యాసాలు సిన్హా ఈ బడ్జెట్‌ లో జరిపారు. అందుకే ఈబడ్జెట్‌ స్వభావాన్ని నిర్ధుష్టంగా వ్యాఖ్యానించడానికివీలు లేకుండా పోయింది. దేశీయంగా ఏ ఒక్క వర్గానికి అది సంతృప్తినిఇవ్వలేక పోయింది. బహుళ జాతికి మాత్రంమోదం కలిగించింది. చివరకు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన మార్కెట్లు కూడా ప్రతికూలంగాప్రతిస్పందించాయి. మార్కెట్లను దృష్టిలో వుంచుకునేదేశీయ సంస్థల్లో ఎఫ్‌ఎఫ్‌ ఐ ల ఇన్వెస్ట్‌ మెంట్ల గరిష్ట పరిమితిని 40 శాతానికిపెంచారు. పరిమాణాత్మక ఆంక్షలకు సంబంధించిడబ్లుటివో కు ఇచ్చిన హామీలు, ఐటి కిసంబంధించి సింగపూర్‌ ఒడంబడిక, టెక్స్‌ టైల్స్‌ కుసంబంధించి అమెరికాకు ఇచ్చిన మాట, ఇవే ప్రధానంగాఆయన పై పని చేసినట్టుగా కనిపిస్తున్నది.

అయితేవాటికి కూడా ఆయన న్యాయం చేయలేకపోయారు. అదేసమయంలో దేశీయ పారిశ్రామిక రంగానికి భద్రతకొనసాగిస్తున్నట్టుగానే కనిపించి గరిష్ట కస్టమ్స్‌ సుంకాలను తగ్గించడం ద్వారా పోటి ప్రమాదాన్నిపెంచారు. టెక్నాలజి కి పెద్దపీట వేసికంప్యూటర్లు, సెల్‌ ఫోన్లు కారు చౌకగా దొరికేలా జాగ్రత్తలు తీసుకున్న ఆర్థిక మంత్రిదేశంలో మెజార్టీ ప్రజానీకానికి నేటికీ ప్రధానజీవనాధారమైన వ్యవసయరంగం పై భారంమోపారు. ఎక్సైజ్‌ సుంకాల హేతు బద్దీకరణకారణంగాపెప్సీ, కోకకోలా చౌకగా మారితే ప్రాణాధారమైనఅనేక ఔషధాల ధర మరింత పెరగడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలో, ఇంకా 50 శాతం పైగా నిరక్షరాస్యతలోనేవున్న ఈ దేశ ప్రజానికానికి సిన్హా వివరిస్తేబాగుంటుంది. 13 ఏళ్లు వరసగా వరణదేవునికరుణతో రుతుపవనాలు సక్రమంగా పలకరిస్తూవ్యవసాయరంగం సంతృప్తికరంగా రాణిస్తున్నాఆహరరంగంలో భద్రతకు నేటికీ పూచీలేదు. ఎ ఒక్క ఏడాది రుతుపవనాలు మొహంచాటేసినా ఆర్థిక రంగం సంక్షోభంలో పడక తప్పని స్థితినేటికీ వున్నది. బడ్జెట్‌ లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కిఅధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఆర్థిక మంత్రిఅట్టహాసంగా ప్రకటనలు గుప్పించివప్పటికీవాస్తవానికి గత ఏడాది బడ్జెట్‌ అంచనాలకంటే అతి తక్కువ కేటాయింపులుజరిపారు. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి అంత్యంతఅవసరమైన పొదుపును ప్రోత్సహించే చర్యలు కొత్తబడ్జెట్లో లేక పోవడం విస్మయంకలిగించే విషయం. దేశమంటే సాఫ్ట్‌ నేర్‌, స్టాక్‌మార్కెట్లు మాత్రమే కాదు అసంఖ్యాకులైన సామాన్యులు కూడానన్న విషయం ఆర్థిక మంత్రి పట్టించుకున్నట్టుగాలేదు.

హోమ్‌ పేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X